Loading...
You are here:  Home  >  Deccan Abroad  >  Current Article

Telugu Ghazal హంసచెలీ..!

By   /  August 1, 2016  /  No Comments

    Print       Email

FB_IMG_1469583306746నా బంగరు కలల జగతి పండించే హంసచెలీ..!
సఖుని జాడ ప్రియమారగ పట్టిచ్చే హంసచెలీ..!

ఊహమాటు పెన్నిధినే పెనిమిటిగా తెస్తావుగ..
మేఘాలను వీణలుగా పలికించే హంసచెలీ..!

InCorpTaxAct
Suvidha

రగులుతున్న విరహాలను చల్లార్చే పని నీదే..
పసిడిమల్లె పరిమళాలు చిందించే హంసచెలీ..!

నిదురకన్నె ఎదలోయల ఎంత గుబులు రేగిందో..
ఎదురుచూపు మధురిమలను ఒలికించే హంసచెలీ..!

వయారాల కేమున్నది..వరాలనే కోరునుగా..
నవవసంత వింజామర అందించే హంసచెలీ..!

ఈ మాధవ అక్షరాలు తుమ్మెదలై వెన్నంటెను..
కణకణమున గజల్ మధువు గుప్పించే హంసచెలీ..!

Author:

Madhav Rao Koruprolu

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →