గుండెలయ తాళమై వినిపించ రమ్యమే..!
మదిలోని భావమే రవళించ రమ్యమే..!
సందేహ సందడే అలజడిగ మిగులుగా..
కల్యాణి రాగమే ప్రవహించ రమ్యమే..!
నిట్టూర్పు నీడలో నివాసం ఎందుకో..!?
నిగమార్థ సారమే నినదించ రమ్యమే..!
ఏ తీగ మీటినా విరహమే కురియునా..!?
నా అనే భావనే విరమించ రమ్యమే..!
తపనలే తపముగా మారేటి వేళలే..
స్వరములే మౌనమై మోహించ రమ్యమే..!
మాధవుని గజలులో మహిమేమి ఉన్నదో..!?
మధవుకే సాక్షిగా ఊహించ రమ్యమే..!!
Author:
Madhav Rao Koruprolu
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.