Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Telugu Ghazal: ఊపిరి దారిగ అక్షరమాయే..!

By   /  August 10, 2016  /  No Comments

    Print       Email

FB_IMG_1469989435271నురగల పాలను చిలికే పనిలో మునిగెను మనసే..!
ఆశల మెరుపుల మీగడ పట్టగ వేచెను మనసే..!

కాలిన గింజలు చీల్చుకు మొలకలు ఎలాగ వచ్చును..!?
కాలం పిడికిట నలిగే కర్మల మిగిలెను మనసే..!

InCorpTaxAct
Suvidha

అద్దం పలికే కథలను వినగా ఎంతటి భయమో..!?
అర్థం తెలియక బిగిసే తనువుగ ఎదిగెను మనసే..!

మబ్బుల వెంటే పరుగులు పెట్టే నీడలు నిజమా..!?
రాలే చినుకుల ఊహల వీణగ రగిలెను మనసే..!

రెక్కలు తొడిగిన మౌనపు హంసల హాసం కనవే..!?
కలలను కురిసే చీకటి తోడుగ పొగిలెను మనసే..!

మాధవ గజలుకు ఊపిరి దారిగ అక్షరమాయే..!
అక్షయ వేణువు రక్షణ నివ్వగ కరిగెను మనసే..!

Author:

Madhav Rao Koruprolu

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →