Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Telugu Ghazal: నీ వలపే ప్రవహిస్తే కడలైతే నాకేమిటి..!?

By   /  August 15, 2016  /  No Comments

    Print       Email

FB_IMG_1470567008838మెలకువయే పట్టేస్తే రేయైతే నాకేమిటి..!?
నిద్దుర నను చుట్టేస్తే ఎచటైతే నాకేమిటి..!?

కష్టానికి బెదిరిపోక ఎదురీదుట ఎంత హాయి..
నీ నవ్వే వరమిస్తే రాయైతే నాకేమిటి..!?

InCorpTaxAct
Suvidha

నీతోనే ప్రయాణమిక కలకాలం మధురముగా..
నీ ప్రేమే వర్షిస్తే అగ్నైతే నాకేమిటి..!?

చెలిమి వేణు గాన సుధలు వింటున్నా శ్వాసలలో..
నీ చేయే అందిస్తే అడవైతే నాకేమిటి..!?

మౌనవీణ మీటుతున్న పసిడి వెలుగు ఎక్కడిదో..
నీ చూపే కరుణిస్తే ఏమైతే నాకేమిటి..!?

ఈ మాధవ గజలేమో వెన్నెలింటి గంగేమో..
నీ వలపే ప్రవహిస్తే కడలైతే నాకేమిటి..!?

Author:

Madhav Rao Koruprolu

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →