Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Telugu Ghazal: మాధవునకు సవాలైన సఖియ మనసు తెలిసిందా..!?

By   /  August 16, 2016  /  No Comments

    Print       Email

FB_IMG_1470446982517రాయి కొట్టి బతుకుతున్న అమ్మమనసు తెలిసిందా..!
బిడ్డ ఆకలెరిగి కరుగు లేతమనసు తెలిసిందా..!?

పేదరికం వేదించే బహుమానం అవుతున్నది..
మాతృత్వం వరదలైన పాలమనసు తెలిసిందా..!?

InCorpTaxAct
Suvidha

ఎంత తపము..చేస్తుందో ప్రతి తల్లీ అనుక్షణం..
కాలానికి ఎదురీదే మగువ మనసు తెలిసిందా..!?

అభిమానం ఆస్తియైన.. అవమానం గొడుగేనట..
సుప్రశాంత మందిరమౌ ముగ్ధ మనసు తెలిసిందా..!?

పనియే తన దైవంగా..పసివాడే లోకంగా…
జీవితమే పాఠమైన జాణ మనసు తెలిసిందా..!?

అంతులేని మౌనానికి చిరునామా ఆమె తలపు..
మాధవునకు సవాలైన సఖియ మనసు తెలిసిందా..!?

Author:

Madhav Rao Koruprolu

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →