Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Telugu Ghazal: అనుసృజనల మేఘాలే వర్షిస్తే హాయే’లే..!

By   /  August 18, 2016  /  No Comments

    Print       Email

FB_IMG_1470752867577రాలు పూల భావాలను గ్రహియిస్తే హాయే’లే..!
పరిమళించు వలపువీణ  పలికిస్తే హాయే’లే..!

ప్రవహించే  వెన్నెలలా నవ్వడమే పరమార్థం..!
మందహాస మందారం ప్రేమిస్తే హాయే’లే..!

InCorpTaxAct
Suvidha

పున్నాగలు విరజాజుల శరత్కాలమే మధురం..!
గన్నేరుల నీడలలో నిదురిస్తే హాయే’లే..!

కనకాంబర రాగాలకు పరవశమే పవనాలకు..!
పలకరించు మౌనసుధలు ప్రవహిస్తే హాయే’లే..!

సిగలోపల చేరేందుకు మొగ్గలేల సిగ్గు పడునొ..!?
అరుణారుణ కమలాలే వికసిస్తే హాయే’లే..!

ఈ మాధవ గజల్ మధువు మరులు కురియు వేళ ఇదే..!
అనుసృజనల మేఘాలే వర్షిస్తే హాయే’లే..!

Author:

Madhav Rao Koruprolu

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →