Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Telugu Ghazal: ప్రేమలోతు పట్టేయగ విభేదాలు కావాలా..!

By   /  August 20, 2016  /  No Comments

    Print       Email

13254167_896390973822258_3568960880258876080_nఅవినీతిని మసిచేయగ ఆయుధాలు కావాలా..!
యుద్ధభయం కాల్చేయగ వివాదాలు కావాలా..!

మచ్చలేని చిరునవ్వుల వనమున్నది నీ మదిలో..
చెలిమి పూలు పంచేయగ నినాదాలు కావాలా..!

InCorpTaxAct
Suvidha

అంతరంగ గగనమ్మున వెలుగునిధులు ఉన్నవిగా..
నీ ఇంటిని తుడిచేయగ ప్రబోధాలు కావాలా..!

ప్రశ్నించే మస్తిష్కపు జిజ్ఞాసకు స్వాగతమే..
విషాదాన్ని  వదిలేయగ వినోదాలు కావాలా..!

సంతోషపు సాగరాలు కోటికోట్లు అణువణువున..
ప్రేమలోతు పట్టేయగ విభేదాలు కావాలా..!

ఈ మాధవ గజలువీధి అక్షయమౌ సంబరమే..!
నిన్ను నీవు అల్లేయగ సునాదాలు కావాలా…!

Author:

Madhav Rao Koruprolu

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →