Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Telugu Ghazal: నీ తెలివికి నీవుగాక సాక్షి ఎవరు లోకంలో..?!

By   /  August 16, 2016  /  No Comments

    Print       Email

IMG_20160414_142219_868ఆమ్మకన్న అమాయకపు జీవి ఎవరు లోకంలో..?!

నాన్నకన్న చెలిమి పంచు మనిషి ఎవరు లోకంలో..?!
తనను తాను మరచిపోవు తనమేగా మాతృత్వం..!
జన్మనిచ్చి దారి చూపు జ్యోతి ఎవరు లోకంలో..!?
ఆశమాటు నీ శ్వాసకు దారమైన చైతన్యం..!
వేలు పట్టి నడిపించే మౌని ఎవరు లోకంలో..?!
లాలపోసి..ఊయలూపి..నిదురపుచ్చి పెద్దచేసె..!
తన ముద్దుల ఒడి కాచిన శక్తి ఎవరు లోకంలో..!?
పనికైనా పాటకైన పగలు రేయి చూడడుగా..!
తన మూపుకు ఎత్తుకునే జ్ఞాని ఎవరు లోకంలో..?!
నీ తోడూ నీడలురా తలిదండ్రులు మాధవుడా..!
నీ తెలివికి నీవుగాక సాక్షి ఎవరు లోకంలో..?!
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →