Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Telugu Ghazal: సాహసమే ఊపిరిగా పంచు కొరకు పరుగులన్ని..!

By   /  August 21, 2016  /  No Comments

    Print       Email

mother-s-day-sentiment-104886ఎచటి నుండి ఎచ్చటికో మెతుకు కొరకు పరుగులన్ని..!
బాధ్యతతో బంధాలను కాచు కొరకు పరుగులన్ని..!

చిరునవ్వుల చిరునామా వ్రాసిచ్చే వారెవ్వరు..!?
మాతృత్వపు మధురిమలను నిలుపు కొరకు పరుగులన్ని..!

InCorpTaxAct
Suvidha

కష్టాలో  కన్నీళ్ళో చరిత్రకడలి పాలే’లే..!
కలలపంట చేజారని బ్రతుకు కొరకు పరుగులన్ని..!

అనుభవాల సాక్షియైన అద్దమంటె నీ మనసే..!
సాహసమే ఊపిరిగా పంచు కొరకు పరుగులన్ని..!

మౌనంగా వర్షించే మేఘానిదె ప్రేమంటే..!
వైభోగపు గగనమ్ముల చేరు కొరకు పరుగులన్ని..!

మధురోహలు పండించే ఈ మాధవ పథమిదుగో..
చెలిమివీణ తెలిసి పట్టి మీటు కొరకు పరుగులన్ని..!

Author:

Madhav Rao Koruprolu

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →