సెలయేటి గీతాల స్వరములా ఆ నవ్వు..!
అలరించు రాగాల తరువులా ఆ నవ్వు..!
కొలువగా తరమౌనె ఈ పలుకు పాత్రతో..
నవకాంతి దారాల కొలువులా ఆ నవ్వు..!
కాలాన్ని ప్రశ్నించు సౌందర్య తీరమా..
చెలిమింటి గగనాల వనములా ఆ నవ్వు..!
ఆ నీలి మేఘాల పరుగుకే మూలమా..
సడిలేని తీర్థాల వరములా ఆ నవ్వు..!
సంపెంగ చందనపు పవనాల హారమా..
కలహంస మౌనాల పథములా ఆ నవ్వు..!
మాధవుని గజలింటి అందియల నాదమా..
సరసార్థ కావ్యాల పురములా ఆ నవ్వు..!
Author:
Madhav Rao Koruprolu
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.