Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Telugu Ghazal

By   /  July 17, 2016  /  No Comments

    Print       Email

FB_IMG_1468628435781 (1)నీ కోసం ఎదురుచూపు పరిమళించె ఎదలోయల..!
నీ తలపుల వనములెన్నొ మొగ్గ తొడిగె ఎదలోయల..!

ఎపుడు ఎరుక కలిగిందో..ప్రేమ ఎలా విరిసిందో..!?
అపురూపమైన భావనమే పురులు విప్పె ఎదలోయల..!

InCorpTaxAct
Suvidha

చెలిమి కన్న మధురమైన..సంగతేమి ఉంది సఖా..!?
సప్తవర్ణ మిశ్రమమే మిగుల పొంగె ఎదలోయల..!

లోకాలను శ్వాసించే కళ ఏదో నేర్పినావు నేర్పకనే..!
నా నేనుల కలవరమే ఇగిరిపోయె ఎదలోయల..!

ఇన్నినాళ్ళు నీవెవరో నేనెవరో ఎంత గొడవ..!
బిడియపడే ద్వారాలే మాయమాయె ఎదలోయల..!

మాధవునకు చెప్పేందుకు ఏమున్నది ఇంతకన్న..!
క్రీడించే తరుణాలే పల్లవించె ఎదలోయల..!

Author:

Madhav Rao Koruprolu

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →