Loading...
You are here:  Home  >  Deccan Abroad  >  Current Article

Telugu Ghazal

By   /  July 19, 2016  /  No Comments

    Print       Email

FB_IMG_1468729001750కనుపాపను పదిలముగా కాపాడుట చెలిమి గుట్టు..!
అనుక్షణం ఓ సాక్షిగ జీవించుట చెలిమి గుట్టు..!

రూపాయికి రూపాయిని కలుపుటలో సుఖమెంతో..?!
ఒకరినొకరు ఎడబాయక చూచుకొనుట చెలిమి గుట్టు..!

InCorpTaxAct
Suvidha

చిగురించే ప్రతి ఆశకు కలవరింత సహజమేలె..!
ప్రతి చెట్టును బహు చక్కగ రక్షించుట చెలిమి గుట్టు..!

ఆ వినీల ఆకాశం మునిగె చూడు మౌనంలో..!
పక్షికోటి భక్షింపక స్వేచ్ఛనిడుట చెలిమి గుట్టు..!

తోటి జీవరాశులన్ని అసలు దైవ రూపాలే..!
నిజం తెలిసి ప్రేమమీర మసలుకొనుట చెలిమి గుట్టు..!

భూమాతకు ఆవేదన నిను గూర్చే మా(న)ధవుడా..!
ఈ సంగతి ఎరుకతోటి గమనించుట చెలిమి గుట్టు..!!

Author:

Madhav Rao Koruprolu

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →