ధ్యానానికి ప్రతిరూపం ప్రతి కణమున దాగి వుంది.!
అజ్ఞానం తొలగు విధము అనుభవమున దాగి వుంది..!
నీ శ్వాసయె నీ గురువని తెలుసుకొనుట తొలి ధర్మం..!
మధురమైన మనశ్శాంతి సాధనమున దాగి వుంది..!
అందమైన అందనట్టి నిధులెన్నో కలవు కదా నీలోనే..!
విందుగొలుపు సంగీతము భావనమున దాగి వుంది..!
కోటికోట్ల లోకమ్ములు కొలువుతీరె ప్రతి అణువున..!
కర్మచక్రపు కథలు సారము చింతనమున దాగి వుంది..!
సంపదలకే సంపదైనది పొందగోరుట పుణ్యవశమే..!
అసలు శక్తి రహస్యం చైతన్యమున దాగి వుంది..!
మహావతారుడే మూల గురువౌ మాధవుడు కదా..!
అన్ని నేను అను సంగతి అక్షరమున దాగి వుంది..!
Author:
Madhav Rao Korupr
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.