Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Telugu Ghazal: గజల్ రాణి పాదాలకు పారాణిగ మారేనే..

By   /  November 20, 2016  /  No Comments

    Print       Email

fb_img_1479008112844సిగ్గుపూల తరువింటికి మనసు వ్రాసి ఇచ్చానే..!
కనులెత్తని కలువచెలికి కలలు వ్రాసి ఇచ్చానే..!

విరహాలను తరిమేసే పసిడిరాశి తానేగా..
ముద్దొచ్చే చినుకింటికి మరులు వ్రాసి ఇచ్చానే..!

InCorpTaxAct
Suvidha

గజల్ రాణి పాదాలకు పారాణిగ మారేనే..
తన అందెల మౌనాలకు ధ్వనులు వ్రాసి ఇచ్చానే..!

అనుక్షణం వర్ణమయం చేస్తున్నది భువనాలను..
తన పాటకు సుస్వరాల లయలు వ్రాసి ఇచ్చానే..!

నేను,నాది విసిరేయగ సాయమైన గగనమామె..
మరపువీణ రాగసుధల సరులు వ్రాసి ఇచ్చానే..!

మాధవుడా..మాటలతో కలవరమే మిగిలేనట..
అనుభూతుల పరంపరల తనువు వ్రాసి ఇచ్చానే..!

Author:

Madhav Rao Koruprolu

 

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →