Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Telugu Ghazal: సంబరాలు నింపినావు..జగమంతా గొడవైనది..!

By   /  December 25, 2016  /  No Comments

    Print       Email
fb_img_1482685669041వాలుజడను విసిరినావు..మనసంతా గొడవైంది..!
వాలుచూపు రువ్వినావు..తనువంతా..గొడవైంది..!
నెమలిఆట నిలచిపోయె..నీ సొగసులు చూడగానె..
ఎంతమాయ చేసినావు..వనమంతా..గొడవైంది..!
కలహంసల జలకాలకు..నీ నవ్వే నదియైనది..
సరసమెంత కురిసినావు..సరసంతా గొడవైనది..!
పగలురేయి తేడాలే లేకపోయె జగడాలకు..
పగడాలను విసిరినావు..వలపంతా గొడవైనది..!
మైమరచిన వసంతాలు..తుళ్ళిపడక తప్పదుగా..
సంబరాలు నింపినావు..జగమంతా గొడవైనది..!
మాధవు అద్దమంటి గజల్ నిధియె నీవు కదా..
మౌనాలను మీటినావు..ఇహమంతా గొడవైనది..!
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →