Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Telugu Heros

By   /  April 8, 2016  /  Comments Off on Telugu Heros

    Print       Email

 

దుర్ముఖిలో.. హిట్టా.. ఫ‌ట్టా?heros

InCorpTaxAct
Suvidha

 

 

 

మ‌న తెలుగు హీరోల జాత‌కాలు దుర్ముఖి నామ సంవ‌త్స‌రంలో ఎలా ఉండ‌బోతున్నాయి? ఎవ‌రు మ‌హ‌ర్జాత‌కులు కాబోతున్నారు? ఎవ‌రు వ‌రుస హిట్టులు కొట్ట‌బోతున్నారు. ఇంత‌కీ ఆయ‌న సినిమా ఈ ఏడాది పూర్తి అవుతుందా? 100వ సినిమా ఒక‌రిది.. 150వ సినిమా మ‌రొక‌రిది.. ఎవ‌రు హిట్ కోడ‌తారు.. ఎవ‌రి సినిమాలు ఫ‌ట్ అవుతాయి. మొత్తంగా దుర్ముఖినామ సంవ‌త్స‌రం స్టార్స్‌కు క‌లిసి వ‌స్తుందో.. రాదో తెలుసుకోవాలంటే ఇది చ‌ద‌వాల్సిందే.

తెలుగువారి కొత్త ఏడాది దుర్ముఖినామ సంవ‌త్స‌రం వ‌చ్చేంది. ఈ ఏడాదిలో చాలా మంది అగ్ర‌హీరోలు త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకోనున్నారు. చాలా కాలం నుంచి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెగాస్టార్ చిరంజీవి సినిమా ద‌గ్గ‌రి నుంచి జూనియ‌ర్ ఎన్టీఆర్ సినిమా వ‌ర‌కు అన్ని కూడా ఈ ఏడాదే రిలీజ్ కాబోతున్నాయి.

క‌త్తిలాంటోడు: మెగాస్టార్ చిరంజీవి క‌త్తిలాంటోడు సినిమాతో ఈ ఏడాదే అభిమానుల ముందుకు రాబోతున్నాడు. కోలీవుడ్ మూవీ క‌త్తిని రీమేక్ చేస్తున్న ఈ సినిమా భారీ విజ‌యం సాధిస్తుంద‌ని సినిమా వ‌ర్గాలు భావిస్తున్నా విడుద‌లైన త‌ర్వాత గానీ చెప్ప‌లేం చిరంజీవి ఎన్ని రికార్డులు బ‌ద్ద‌లు కొట్ట‌బోతున్నార‌నే విష‌యం.

గౌత‌మీ పుత్ర శాత‌క‌ర్ణిగా బాల‌య్య‌: న‌ంద‌మూరి న‌ట సింహం బాల‌కృష్ణ ఈ ఏడాదిలోనే సెంచిరీ కొట్ట‌బోతున్నాడు. చాలా ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న త‌న 100వ సినిమాను ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు క్రిష్ డైరెక్ట్ చేయ‌నున్నాడు. గౌత‌మీ పుత్ర శాత‌క‌ర్ణిగా చారిత్ర‌క పాత్ర‌లో న‌టిస్తున్న బాల‌య్య త‌న 100వ చిత్రంతో చ‌రిత్ర సృష్టింస్తార‌ని సినీ వ‌ర్గాల అభిప్రాయం.

హ‌థీరాం బాబాగా నాగార్జున‌: ప్ర‌స్తుతం నాగార్జున కాలం న‌డుస్తోంది. గ‌త ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా నాగార్జున వ‌రుస విజ‌యాలు అందుకునే అవ‌కాశం క‌నిపిస్తోంది. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కె.రాఘ‌వేంద్ర రావు ద‌ర్శ‌క‌త్వంలో హ‌థీరాం బాబాగా నాగార్జున క‌నిపించ‌బోతున్నార‌ని తెలుస్తోంది. సోగ్గాడుగా మెప్పించి.. ఊపిరి సినిమాలో బిలియ‌నీర్‌గా ఆక‌ట్టుకున్న నాగార్జున హథీరాం బాబా పాత్రతో కూడా ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తార‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

బాబు బంగారంలో వెంకీ: రీమేక్ కాన్సెప్టుల‌తో విజ‌యాలు అందుకోవ‌డం విక్ట‌రీ వెంక‌టేష్‌కు తెలిసినంత‌గా మ‌రెవ్వ‌రికీ తెలియ‌ద‌న‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు. ఇటీవ‌ల విడుద‌లైన సినిమాలే అందుకు నిద‌ర్శ‌నం. తాజాగా బాబు బంగారం అంటూ దుర్ముఖినామ సంవ‌త్స‌రంలో రాబోతున్నాడు. ఈ ఏడాది కూడా వెంక‌టేష్ విక్ట‌రీనే.

బ్ర‌హ్మోత్స‌వం: మ‌హేష్‌.. ఈ పేరు ఒక్క‌టి చాలు సినిమా ఇండ‌స్ట్రీని ఎక్క‌డికో తీసుకెళ్ల‌డానికి. డ‌బ్బులు సునామీలా రాబ‌ట్ట‌డానికి. దుర్ముఖి నామ సంవ‌త్స‌రంలో మ‌హేష్ బ్ర‌హ్మోత్స‌వం సినిమాతో రానున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్లు కానీ.. ఆ సినిమా టైటిల్ గానీ చూస్తుంటే మ‌హేష్ ఖాతాలో మ‌రో విజ‌యం ఖాయం అన్న‌ట్లుగా ఉంది.

జూనియ‌ర్‌.. జ‌న‌తా గ్యారేజ్‌: ఇటీవ‌లే నాన్న‌కు ప్రేమ‌తో హిట్ కొట్టిన జూనియ‌ర్ ఎన్టీఆర్ దుర్ముఖి నామ సంవ‌త్స‌రంలో రానున్న జ‌న‌తా గ్యారేజీ సినిమాతో కూడా హిట్ కొడ‌తాడ‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ టాక్‌. ఇదే ఏడాది ఇద్ద‌రి ప్ర‌ముఖ ద‌ర్శ‌కులతో జూనియ‌ర్ సినిమా చేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

స‌రైనోడు..బ‌న్ని: దుర్ముఖినామ సంవ‌త్స‌రం మొద‌టి రోజున పుట్టిన రోజు చేసుకున్న బ‌న్నీ ఈ ఏడాదిలోనే స‌రైనోడు హిట్ కొట్టి మ‌రో పండుగ‌ను చేసుకుంటాడ‌నంలో ఎలాంటి సందేహం లేదు.స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మ‌రో రెండు వారాల్లో స‌రైనోడుతో ప్ర‌జ‌ల ముందుకు రాబోతున్నాడు.

చివ‌ర‌గా దుర్ముఖినామ సంవ‌త్స‌రంలో ప్రేక్ష‌కుల‌కు పెద్ద హిట్ ఇచ్చిన ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌చ్చే ఏడాదిలో సినిమా క‌ష్ట‌మే అని చెప్పాలి. ఆయ‌న కోసం చాలా మంది క్యూలో ఉన్నా మ‌రో సినిమా తీస్తాడ‌న‌డం కొంచెం క‌ష్ట‌మే.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →