Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Telugu Language is ancient than Tamil Language?

By   /  August 9, 2016  /  Comments Off on Telugu Language is ancient than Tamil Language?

    Print       Email

court orderతెలుగు ప్రాచీన భాషే!

 

InCorpTaxAct
Suvidha

 

 

తెలుగు భాష‌ను చాలా మంది చిన్న‌చూపు చూశారు. కొంత‌మంది హేళన చేశారు. తెలుగులో మాట్లాడితే అదో ర‌కంగా కూడా చూశారు. కార‌ణ‌మేమంటే త‌మిళ భాష‌లాగా తెలుగు ప్రాచీన భాష కాద‌న్న‌ది ఎక్కువ మంది న‌మ్మ‌కం. కానీ అది త‌ప్ప‌ని తేలిపోయింది.  తెలుగు ప్రాచీన భాషగా పరిగణించొచ్చా? లేదా? అన్న అంశంపై మద్రాస్ హైకోర్టులో ఒక వాజ్యం న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే  తాజాగా కోర్టు తన తీర్పును ఇచ్చింది. తాజా తీర్పు ప్రకారం తెలుగు భాష ప్రాచీన భాషే అనటానికి ఎలాంటి సందేహం అక్కర్లేదని న్యాయస్థానం పేర్కొంది. తెలుగు ప్రాచీన భాష కాదంటూ దాఖలైన పిటీషన్ ను  కొట్టేసిన మద్రాస్ హైకోర్టు.. తెలుగుకు ప్రాచీన హోదా ఇవ్వటానికి అవసరమైన అన్నిఅర్హతలూ ఉన్నాయని.. వాటిన్నింటిని పరిశీలించిన మీదటే.. నిబంధనల ప్రకారం హోదా దక్కిందంటూ జడ్జి పేర్కొనటం గమనార్హం. గతంలో తెలుగోళ్లు చేసిన తప్పుల కారణంగా.. తెలుగు అన్న వెంటనే మద్రాసీ అంటూ చులకనగా మాట్లాడే వేళ.. తెలుగును ప్రాచీన భాషగా ఎలా గుర్తిస్తారంటూ తమిళనాడుకు చెందిన ఒక వ్యక్తి దాఖలు చేసిన పిటీషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం తెలుగు ప్రాచీన భాషగా గుర్తిస్తూ తాజాగా తీర్పు వెలువరించింది.

కాగా తాజా తీర్పుతో తెలుగుకు ప్రాచీన హోదా దక్కటంతోపాటు.. రూ.100 కోట్ల మేర నిధులు వచ్చే అవకాశం ఉంది. ఈ నిధులతో తెలుగు భాషను మరింత పరిపుష్టం చేసేందుకు ప్రయత్నాలు జరిగేందుకు అవకాశం ఉంది.ఇది..నిజంగా తెలుగోళ్ల అసలుసిసలు విజయంగా చెప్పాలి. తెలుగు భాష నాలుగు కాలాల పాటు నిల‌బ‌డాలి అంటే తెలుగును నిర్ల‌క్ష్యం చేయ‌కుండా తెలుగువాళ్లు అంద‌రూ కూడా తెలుగులోనే మాట్లాడాల‌ని భాషా పండితులు, మేధావులు అంటున్నారు. ప‌ర‌భాష‌కంటే… మాతృభాష‌పై మ‌మ‌కారం పెంచుకుంటేనే అది సాధ్య‌మ‌వుతుంద‌ని వారంటున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

GATeS 15 th Anniversary and Telangana Formation Day Celebrations

Read More →