Loading...
You are here:  Home  >  Deccan Abroad  >  Current Article

Telugu Legends: “మన ఆణిముత్యాలు – 7..” ” శ్రీ ఆదిభట్ల నారాయణదా సు ”

By   /  September 5, 2016  /  No Comments

    Print       Email
aadibhatlaహరికథ అని అనగానే మనకు స్పురించే మొదటి వ్యక్తి శ్రీ ఆదిభట్ల నారాయణదాసు. అద్భుత సంగీత సాహిత్య సమ్మేళన సమాహర కళారూపమైన మన హరికకథకు ఆద్యుడు..“హరికథా పితామహ ” అనే బిరుదు పొందిన వాడు..
 ”శ్రీ ఆదిభట్ల నారాయణదాసు ”  .సంస్కృతాంధ్రాలలో అనేక రచనలు చేసిన రచయిత, కవి, బహుభాషా కోవిదుడు, తాత్వికుడు. తెలుగునాటనే కాక ఇతర రాష్ట్రాలలో కూడా హరికథా ప్రదర్శనలిచ్చి, ప్రజల మన్ననలను పొందిన సుప్రసిద్ధ కళాకారుడాయన. “శ్రీమత్” మరియు “అజ్జాడ” పదాలు కలిపి “శ్రీమదజ్జాడ నారాయణ దాసు” గురువునకు వందనములు చెప్పడం హరికథారంభంలో ఇప్పటికీ కళాకారులు పాటిస్తున్న సంప్రదాయం.

 1864 ఆగస్ట్ 31న  బలిజిపేట మండలంలో  అజ్జాడ  గ్రామంలోవిజయనగరం  జిల్లా, బొబ్బిలి వద్ద,  బలిజిపేట లక్ష్మీ నరసమాంబ, వేంకటచయనులు దంపతులకు జన్మించాడు. ఆయన అసలు పేరు సూర్యనారాయణ. హరికథకుడిగా ప్రసిద్ధి చెందాక, ఆయన నారాయణదాసుగా ప్రఖ్యాతిగాంచాడు. పేదరికం కారణంగా చిన్నతనంలో బడికి వెళ్ళలేకపోయినా, పద్యాలు, శ్లోకాలు విని, కంఠతా పట్టి తిరిగి చక్కగా వల్లించేవాడు.

కేవలం ఐదేళ్ళ  ప్రాయంలోనే, భాగవత పద్యాలు ఎన్నో అప్పజెప్పేవాడు . ఒకసారి వారి అమ్మగారు పిల్లవాడిని ఏదో పుణ్యక్షేత్రానికి తీసుకువెళితే అక్కడ పుస్తకాల షాపు లో, భాగవత గ్రంథం చూసి (బాల దాసు)అది కావాలని మారాం చేస్తుంటే, ఆ కొట్టు యజమాని, భాగవతం నీకేమి అర్థమవుతుంది అన్నాడట. అంతే ఆ కుర్రవాడు ఆపకుండా భాగవత పద్యాలు ఎన్నోగడగడా ఏకధారగా చెప్పాడట. అది చూసి, ఆ కొట్టు యజమాని ఆనందంగా పిల్లవానికి ఆ పుస్తకం తో పాటు, కొంత దక్షిణ కూడ ఇచ్చి పంపించటం జరిగిందట.

InCorpTaxAct
Suvidha

ఒకసారి దాసు వాళ్ళ తాతగారింటికి వెళ్ళినపుడు అక్కడ అరుగు మీద కూర్చుని రాగయుక్తంగా పద్యాలు పాడుతూ ఉంటే, వాళ్ళ తాతగారు ముచ్చటపడి, తన దగ్గరే ఉంచుకుని సంగీతం నేర్పుతానని వాళ్ళ అమ్మగారికి చెప్పారట. దాంతో అప్పటిదాకా, ఎటో సాగుతున్న నావకి చుక్కాని దొరికినట్లైంది. ఒకప్రక్క సంగీత సాధన, ఇంకో ప్రక్క విద్యాభ్యాసం. అలా తన 14 వ ఏట ఒకటవ తరగతిలో చేరాడు నారాయణదాసు.

అంతేగాక నారాయణదాసు ఈసఫ్ కథలను నూఱుగంటి పేరిట అనువదించి వీరేశలింగం ప్రచురణాలయానికి పంపగా, ఆ గ్రంథ ప్రచురణను తొక్కిపట్టి ఆ మార్గంలోనే ఈసఫ్ కథలను తానుకూడా తెనుగు చేసి ముందుగా ప్రకటించారు. అది విద్యార్థులకు పాఠ్యగ్రంథమైంది. తర్వాతే నూఱుగంటి వెలుగుచూసింది.

అయితే ఈయనకే ప్రత్యేకమైన హరికథను ని వెలుగులోకి తెచ్చింది మాత్రం జయంతి రామదాసు. మొదటిది రాజమండ్రి లో ఏర్పాటు చేశారు. ఇప్పటిలా కరెంటు లేదు. మైకులు, సౌండ్ బాక్స్ లు లేవు. మరి అప్పుడు అక్కడ ఇసుక వేస్తే రాలనంత జనం, మధ్యలో వేదిక మీద నారాయణ దాసు. అంతే ఉన్నట్లుండి మ్రోగింది కంచు కంఠం . ఊరంతా ఉలిక్కిపడింది. గంభీరమైన ఆకారం, ఒక చేతిలో చిడతలు, కాళ్ళకి గజ్జెలు. అలా మొదటి హరికథ కి అంకురార్పణ జరిగింది.

ఆ తరువాత నారాయణ దాసు వెనక్కి తిరిగి చూసుకోలేదు. అతని ఖ్యాతి వాడవాడలా వ్యాపించింది.. మైసూర్ మహారాజు గారి నుండి ఆహ్వానం అందింది. మైసూర్ రాజావారు దాసుగారి హరికథకి ముగ్ధుడైపోయాడు. దీనితో పాటు, వీణాగానం కూడా అడిగి మరీ విన్నాడు. పెద్దయెత్తున బహుమతులు సమర్పించాడు.
సాహిత్యం..సంగీతం గానం.. త్రివిధ ప్రతిభామూర్తి నారాయణదాసు హరికథ అనే కళను అత్యున్నత శిఖరాలకు చేర్చాడు. ఈ మూడింటి కలయికకూ భక్తి అనే భావం ప్రాణంగా హరికథలు రచించాడు, చెప్పాడు, నేర్పాడు. ఆయన హరికథ వినడం ఒక గొప్ప అనుభూతిగా అప్పటివారు చెప్పుకొనేవారు. మొత్తం ఆయన తెలుగులో 17, సంస్కృతంలో 3, అచ్చతెలుగులో ఒకటి హరికథలను రచించాడు. కొన్నిమార్లు ఒక్కొక్క వర్ణన నాలుగైదు పేజీల నిడివి వరకూ సాగేది.

నారాయణదాసు కలకత్తాలో ‘శ్రీ కృష్ణజన్మ’ హరికథ సంస్కృతంలో గానం చేసి హిందీలో భావాన్ని వివరించాడు.

1919లో అప్పటి విజయనగరం మహారాజు స్థాపించిన శ్రీ విజయరామ గాన పాఠశాల కు మొదటి ప్రధానాధ్యాపకునిగా నారాయణదాసును నియమించారు. ప్రసిద్ధ వయొలిన్ విద్వాంసుడు శ్రీ ద్వారం వెంకట స్వామి నాయుడు  ఈయనకు సహాధ్యాపకునిగా ఉన్నాడు. ఎందరో ప్రముఖ కళాకారులు ఈ విద్యాసంస్థనుండి ఆంధ్రదేశానికి లభించారు. వారిలో మన శ్రీ ఘంటశాల వెంకటేశ్వరరావు ఒకడు. నారాయణదాసు ఆధ్వర్యంలో నడిచే పాఠశాలలో చదువుకొన్నామని చెప్పుకోవడం అప్పట్లో చాలా గొప్పగా భావించేవారు.

నారాయణదాసు హిందుస్థానీ..భైరవీ రాగాలాపనను విశ్వకవి..గురుదేవులు..శ్రీ  రవీంద్రనాథ ఠాగూర్ ఎంతగానో ప్రశంసించారు. అంతేకాదు విజయనగరం కళాశాల పాఠ్యాంశాలు వారి ‘శాంతినికేతన్’ లో ప్రవేశపెట్టడం జరిగింది.

నారాయణ దాసుగారి సకల కళా నైపుణ్యానికి ముచ్చటపడిన బ్రిటీష్ వారు నోబుల్ పురస్కారానికి నామినేట్ చేద్దామనుకున్నారట. కానీ నారాయణదాసు ఒప్పుకోలేదట. తన జీవితం మొత్తం, తాను జన్మించిన తెలుగు గడ్డకి తన వంతు సేవ చేసి, 1945, జనవరి 2వ తేదీన తనువూ చాలించినా. పవిత్రమైన హరికథా రూపంగా తెలుగు గడ్డపై చిరస్థాయిగా సజీవచైతన్య మూర్తిగా నిలచియే ఉన్నారు..ఉంటారు.మరి మన పితామహుని స్మృతికి మనం శాశ్వతంగా హరికథను శతవిధాల రక్షించుకోవలసిన అపురూప బాధ్యత తెలుగు ప్రజలందరికీ ఉంది.

 

Author:

Madhav Rao Koruprolu

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Parody Song from movie on aakali raajyam to fight Corona-virus

Read More →