Loading...
You are here:  Home  >  Deccan Abroad  >  Current Article

Telugu Legends: మన ఆణిముత్యాలు – 6.. ”శ్రీ కందుకూరి వీరేశలింగం..!”(పార్ట్-1)

By   /  August 20, 2016  /  No Comments

    Print       Email

KandukuriVeeresalingamకొందరు మహామహులను గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆలాంటి వారినే ఆణిముత్యాలుగా పేర్కొంటాం.మరి ఆ కోవలో ఎన్నదగిన ప్రముఖులలో ఒకరు “శ్రీ కందుకూరి వీరేశలింగం”..!
వంశమూలం నెల్లూరు జిల్లా కందుకూరు అనే ఊరు కావడం విశేషమే అయినా..తాతముత్తాతలు ఏలూరు చేరుకుని క్రమేపీ రాజమండ్రిలో స్థిరపడటం ఆ క్షేత్రం చేసుకున్న పుణ్యవిశేషంగా చెప్పుకోవచ్చు.
వీరేశలింగం గారి వంశీకులు శైవ సంప్రదాయకులు.వీరేశలింగం పంతులుగారి తాతగారి పేరూ వీరేశలింగమే. అదే వీరికి పెట్టారు.అయితే ముత్తాతగారైన చంద్రమౌళిగారు అప్పట్లోనే వైష్ణవుల అమ్మాయిని వినాహమాడారని వీరేశలింగంగారు తమ రక్తంలో జీర్ణించుకుని వున్న సంఘసంస్కరణాభిలాషను వారే స్వయంగా చెప్పడం జరిగింది. తాతగారైన వీరేశలింగంగారు ఏలూరులో పుట్టి పెరిగినా ఉద్యోగరీత్యా జమీందారుల వద్ద పని చేస్తూ రాజమహేంద్రవరం చేరుకుని అక్కడే స్థిరపడి ఎంతో డబ్బు గడించి గొప్ప పేరు సొంతంచేసుకోవటమే కాకుండా చాలా చక్కని పెద్ద దివాణం లాంటి ఇల్లొకటి కట్టించారు.పేదసాదలను బాగా ఆదుకునేవారు.మరి తాతగారైన ఆ వీరేశలింగం గారు గొప్ప సాహిత్య ప్రియులు. అలా వారు రామాయణ, భారత,భాగవతాది పురాణాలు ఇంట్లో చెప్పించుకు వినేవారు. తాటాకులపై వ్రాయగల వారికి జీతం ఇచ్చి.,భోజనం పెట్టి ఆయా గ్రంథాలకు ప్రతులు వ్రాయించుకున్నారు.  ఆయన విశేషంగా దానధర్మాలు కూడా చేసారు.
మరి ఎంతో కీర్తి ప్రతిష్ఠలు సంపాదించిన తాతగారైన వీరేశలింగం గారు చనిపోయేనాటికి ఆ కుటుంబంలో వారి శ్రీమతి కావమ్మ గారు, ఇద్దరు కుమారులు వెంకటరత్నం, సుబ్బారాయడు గార్లు..కోడళ్ళు వున్నారు.ఇంకా కుమారులకు సరియైన ఉద్యోగాలు లేకపోవటంతో ఆ పరిస్థితుల్లో ఆయన సంపాదించి పెట్టిన వెండి బంగారు నగలుతో పాటు కలప సయితం అమ్ముకోవలసి వచ్చింది.
సుబ్బారాయుడు పున్నమ్మ దంపతులకు కలిగిన మగబిడ్డడే మన వీరేశలింగం పంతులు గారు. దయ్యాలు భూతాల భయం వున్న తల్లి కడుపున పుట్టినందున చాలా బలహీనంగా వున్నాడా బాల వీరేశలింగం.దాదాపు పాతికేళ్ళ తరువాత ఆ వంశంలో మగ పిల్లాడు పుట్టడంతో తిరగి తాతగారంతటివాడు కావాలని ఆయన పేరు పెట్టారు.
పెదతండ్రిగారైన వెంకటరత్నంగారికి బాల వీరేశలింగమంటే మహా మక్కువ.అయితే నాలుగేళ్ళు కూడా నిండక మునుపే వీరేశలింగం కన్నతండ్రిని కోల్పోవడం జరిగింది.
రాజమండ్రిలో ఐదో ఏట వీధిబడిలో వేసారు వీరేశలింగాన్ని.అంతకుమనుపొక మారు ఓ కాలువలో ప్రమాద వశాత్తు పడిన వీరేశలింగాన్ని తాను పడిపోయిన పల్లకీ బోయి ఒకరు కాపాడటం జరిగింది.
మొదట తనకు చదువు నేర్పిన గురువు పులిపాక అమ్మిరాజుగారు.తరువాత గూని సోమరాజుగారి వద్ద చదువుకున్నాడు.భారతం చదివి చక్కగా అర్థం చెప్పగల
దిట్టయైన సోమరాజుగారి బళ్ళో బాల రామాయణం,ఆంధ్రనామ సంగ్రహం,అమరం( సంస్కృతడ నిఘంటువు) అర్థంతో సహా అన్నీ క్షుణ్ణంగా నేర్చుకున్నారు.
సోమరాజుగారు ఇంకా పోతన భాగవతంలోని రుక్మిణీ కల్యాణం పద్యాలు..సుమతి శతకం.,కృష్ణ శతకం వల్లె వేయంచారు.అప్పుడు వీరేశలింగం వయసు కేవలం పదకొండు సంవత్సరాలు మాత్రమే.
తాలూకా కచేరీలోన..కోర్టులోనో ఎవరినైనా అధికారిని ఆశ్రయించి  జీతం లేకుండా పని చేస్తేనే ఉద్యోగం ఏదైనా పొందటం తప్ప ఎలాంటి పోటీ పరీక్షలుండేవి కావు.’     ఉమ్మేదు వారీ’ పద్ధతి.అంటే వాలంటరీగా పనిచేసే వారికే ఏదో సిఫారసుపై ఉద్యోగం వచ్చేది.అలా తాలూకా కచేరీలో పని చేసే పోతరాజు రఘురామయ్యగారి వద్ద వలంటరీగా పని నేర్చుకునే ఆరోజుల్లోనే సిపాయీల తిరుగుబాటు మొదలైంది.ఉద్యోగం కావలసిన వారు తప్పక ఇంగ్లీష్ నేర్చుకోవలసిన కారణంగా రాజమండ్రి గవర్నమెంట్ స్కూలులో చేరాడు. వీరేశలింగం మనిషి పూచికపుల్లలా వున్నా చదువులో మంచి ఏసంథాగ్రాహి.అప్పటి ఆచార ప్రకారం అతనికి ఏడో ఏట ఉపనయనం చేసారు.అద్దంకి పట్టాభిరామయ్యగారి కూతురు ఎనిమిదేళ్ళ బావమ్మతో మరి మన పదమూడు నిండని వీరేశలింగం గారికి పెళ్ళి జరిగింది.పెళ్ళికి ఆ రోజుల్లో వేశ్యలచేత ఆట పాట.. సంగీత కచేరీలు వుండటం రివాజు.మరి చాలా గౌరవనీయమైన సంప్రదాయం కూడా అవటంచేత అలానే జరిపించారు పెళ్ళి తంతు.పెదతండ్రి వెంకటరత్నంగారికి మాత్రం శాంతి లేదు.ఇంట్లో తోడికోడళ్ళ మనస్పర్దల మూలంగా కుటుంబపు సొత్తు రెండు భాగాలు చేయక తప్పలేదు. అలా తల్లి పున్నమ్మగారితో వేరుగా వుండవలసి వచ్చింది.ఇంటినుండి బయటికి వెళ్ళేందుకు వీలులేని వీరేశలింగం ఇంటిలోని పుస్తకాలు..తాటాకు గ్రంథాలు అన్నీ చదివేసాడు.ఆయా కథలు పురాణాలు అన్నీ నిజంగా జరిగాయనే నమ్మేవాడు.తనకంటే వయసులో పెద్దవారైన మిత్రులకు ఆ కథలు చెబుతూ వారిని తపము చేయగా హిమాలయాలకు కదిలేందుకు సిద్ధం చేసిన ఘనుడు వీరేశలింగం.
బడిలో చదివిన రోజుల్లో ఎప్పుడూ క్లాసు ఫస్టు వుంటూ..అందరి మన్ననలందుకుని బ్రిటీషు దొరచే పై తరగతికి పుస్తకాలు ఓ నిఘంటువు బహుమతిగా అందుకున్నాడు.పనిపాటలు లేని జులాయి మూకతో పేకాటలాడిన వాడు.ఏది ఎలా వున్నా చదువును ఎన్నడూ అశ్రద్ధ చేయలేదతను.వీరేశలింగం పట్టదలకు మారుపేరు.
తనలో ముందున్న విశ్వాసాలు భయాలు కొన్ని పరిశోధనాత్మక పుస్తకాలు చదవటంతో దూరంచేసుకోగల సత్తా వచ్చింది.దానితో అర్థరాత్రి స్మశానాలకు వెళ్ళి దయ్యాలు భూతాలు అన్నీ బూటకమని రుజువు చేసుకున్నారు.(ఇంకా వుంది – మరి పార్ట్ -2)

 

InCorpTaxAct
Suvidha

 

Author:

Madhav Rao Koruprolu

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

GATeS 15 th Anniversary and Telangana Formation Day Celebrations

Read More →