Loading...
You are here:  Home  >  Community News  >  Current Article

ప్రశాంతతే దొరుకుతోంది..!

By   /  July 12, 2016  /  No Comments

    Print       Email
13254167_896390973822258_3568960880258876080_nవెతుకులాట మానేస్తే వెలుగునదే దొరుకుతోంది..!
గంతులాట నిలిపేస్తే గాంగ సుధే దొరుకుతోంది..!
కోరుకొనుట తెలియకనే జన్మలిలా కొనసాగుట..
పుణ్యఫలం ఏముందో ఇప్పుడదే దొరుకుతోంది..!
చెలియమనసు అద్దమల్లె ఉన్నదిగా నీ ముందే..!
నీవిచ్చిన తియ్యనైన సౌఖ్యమదే దొరుకుతోంది..!
ఎవరినైన నిందిస్తే లాభమేమి లేదుసుమా..!
ప్రస్తుతించ నేర్చినచో ప్రశాంతతే దొరుకుతోంది..!
బాధలన్ని పాఠాలుగ భావించుట ధ్యానములే..
అది తెలిసిన నాటినుండె సరసతయే దొరుకుతోంది..!
కలతపడే మనసుకెపుడు సుఖముండదు గమనిస్తే..
కానుకగా కవ్విస్తూ విరహమదే దొరుకుతోంది..!
మది నిండిన అనురాగం పంచబడును ఎపుడైనా..
చిత్తశుద్ధి తోడైతే తగు ఫలమే దొరుకుతోంది..!
వేణుగాన మాధుర్యం జగమంతా నిండి ఉంది..!
ఈ మాధవ గజల్ లోన జ్ఞాననిధే దొరుకుతోంది..!
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →