అటు జాబిలి..ఇటు నెచ్చెలి..పలకరించు పసిడి వాన..!
చిరునవ్వులు..మరుమల్లెలు.. పరిమళించు పసిడి వాన..!
నీలిమబ్బు సొగసులాగ అలరించే చెలియా కురులు..!
గుండెసడులు..మరులసుడులు..చిలకరించు పసిడి వాన..!
చిగురాకుల సంబరాలు పచ్చదనపు వయారాలు..!
తేనెసిరులు..వలపుగిరులు..కనికరించు పసిడి వాన..!
దీపసఖియ కిరణాలకు భాష్యమెలా వ్రాయాలో..!
పలు కవితలు..మౌనసరులు..పల్లవించు పసిడి వాన..!
చిత్తరువుల వనము కదా చెలి చూపుల నందనమే..!
విరిజల్లులు..హరివిల్లులు..విన్నవించు పసిడి వాన..!
పూలరుతువు శోభలన్ని మాధవునితొ మంతనాలు..!
కలల తెరలు..సాక్షి ఝరులు..విందు పంచు పసిడి వాన..!
Author:
Madhav Rao Koruprolu
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.