Loading...
You are here:  Home  >  Community News  >  Current Article

చిత్రసీమ చెక్కినావ నీ నగవులు

By   /  June 26, 2016  /  No Comments

    Print       Email

FB_IMG_1465051578709చిరుగాలుల సవ్వడిలో దాచినావ నీ పిలుపులు..!
మరుమల్లెల పరిమళముల నింపినావ నీ ఊసులు..!

సిగ్గులన్ని నీ కొరకే ప్రేమలేఖ లైనాయిర..!
నీలికురుల నీడలలో నిలిపినావ నీ తలపులు..!

InCorpTaxAct
Suvidha

నుదుటనున్న సిందూరం చూస్తున్నది నీ సన్నిధి..!
మది పెదవుల చిత్రసీమ చెక్కినావ నీ నగవులు..!

మరువలేని మరులెన్నో ఊరించిన మన్మథుడా..!
కలల ఊట దారిలోన ఒలికినావ నీ మధువులు..!

ఎదలోపలి అలజడులకు జవాబేదొ ఇస్తివిలే..!
లాలించే మౌనసుధల పొదిగినావ నీ పలుకులు..!

నా నేనుల తోటంతా నీదేరా ప్రియ సఖుడా..!
అరకన్నుల  వీధులలో కురిసినావ నీ వెలుగులు..!

Author:

Madhav Rao Koruprolu

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →