Loading...
You are here:  Home  >  Community News  >  Current Article

అగ్ని సాక్షి మన ప్రేమే..!

By   /  June 28, 2016  /  No Comments

    Print       Email

FB_IMG_1466824758271నీ కొరకై చూసి చూసి నిదుర ఇగిరి పోయిందిర..!
వస్తావను ఆశ మటుకు మదిని మిగిలి పోయిందిర..!

కాలంతో పనేముంది నువు ప్రక్కన లేనప్పుడు..!
వెక్కిరించు వెన్నెలయే వేదన పడి పోయిందిర..!

InCorpTaxAct
Suvidha

తరుముతున్న చీకట్లను శ్వాసలోన దాచేసా..!
కలతపడే మనసేమో విసుగు మరచి పోయిందిర..!

నా ఆకలి నన్ను వదిలి ఎంత కాల మయ్యిందో..!?
అసలు ప్రేమ మహిమ కాస్త తెలిసి పోయిందిర..!

దాహానికి విరహానికి అగ్ని సాక్షి మన ప్రేమే..!
చెలిమి వీణ మీటాలని గాలి వేగి పోయిందిర..!

కోటి ఇంద్ర ధనువులతో వెలుగుతున్న తలపు చూడు..!
గుండెలయల గూట చేరి దిగులు మండి పోయిందిర..!

నా భావన సవరించే మాధవుడవు నీవేగా..!
ఈ సంగతి తోచగనే బెంగ ఎగిరి పోయిందిర..!

Author:

Madhav Rao Koruprolu

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →