మగువ నుదుట మగడు దిద్దు సిందూరం మిగుల శుభం..!
మంత్రముగ్ధ అరకన్నుల ఆ ధ్యానం మిగుల శుభం..!
జన్మబంధ మైత్రీవన సోయగమే సరస జగం..!
పగడాలను మరపించే దరహాసం మిగుల శుభం..!
కనకాంబర సుమరాగం నీలికురుల నేలునులే..!
పరవశమది కలిగించే ప్రియభావం మిగుల శుభం..!
మనసు పడే ముచ్చటలను నీ మౌనం పండించును..!
పారాణుల గోరింటగ అనురాగం మిగుల శుభం..!
రతనాలను తన చూపుల కురిపించే హిమబాలరొ..!
రాయంచల గుండెలయల అనువాదం మిగుల శుభం..!
సెలయేళ్ళకు గిలిగింతలు పెట్టేనే మాధవుడిక..!
కొండరాళ్ళ ఎదలోయల సంగీతం మిగుల శుభం..!
Author:
Madhav Rao Koruprolu
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.