అందమైన అన్నపూర్ణ..మనఊరే మరచిపోకు..!
మేలుకొలుపు కోడికూత..చేతననే మరచిపోకు..!
చేలగట్ల పై పరుగులు..చెరువులలో ఆ ఈతలు..
మరి కోతికొమ్మచ్చులు..ఆటలనే మరచిపోకు..!
కోకిలముల పాటలతో కలిపినాము గళములనే..
మావిచిగురు చింతపండు..కలయికనే మరచిపోకు..!
తాటిబెల్ల మరచేతను..నొక్కుకొని తింటిమెటుల..
అమ్మముద్దు నాన్నతిట్లు..హాయేలే మరచిపోకు..!
మధురమైన బాల్యమదే..మరలిరాని నేస్తం కద..!
మన పిల్లల ఆటపాట..మెచ్చటమే మరచిపోకు..!
బడి గంటను గుడి మెట్లను..ఎన్ని నేర్చుకున్నామో..!?
ఓరి వెర్రి మాధ(న)వుడా..పాఠాలే మరచిపోకు..!
అమ్మామ్మా తాతయ్యలు..నాన్నమ్మా ఎవ్వరసలు..?!
మన పెద్దల ఊతకర్ర..అవ్వటమే మరచిపోకు..!
Author:
Madhav Rao Koruprolu
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.