Loading...
You are here:  Home  >  Community News  >  Current Article

కలతలన్ని తొలగినట్లు..!

By   /  July 3, 2016  /  No Comments

    Print       Email

FB_IMG_1466273627877కలలరేయి లేనప్పుడె కలతలన్ని తొలగినట్లు..!
మదిలోతులు చేరినపుడె మమతలన్ని రాలినట్లు..!

చెలిమి పక్షి కనురెప్పలు మీటువేళ ఎంత హాయి..!
చిత్రమల్లె నిలచినపుడె చిక్కులన్ని వీడినట్లు..!

InCorpTaxAct
Suvidha

యుద్ధాలకు సిద్ధపడే తత్వమదే అజ్ఞానం..!
మూర్ఖత్వం వదిలినపుడె కర్మలన్ని కాలినట్లు..!

మౌనమెంత అద్భుతమో మునిగిమునిగి చూడ తెలియు..!
వాదనలను మానినపుడె ప్రశ్నలన్ని ముగిసినట్లు..!

జ్ఞానకాంతి శిఖరమేది లేదు బయట ఎక్కేందుకు..!
వెన్నెలల్లె మిగిలినపుడె ముసుగులన్ని పోయినట్లు..!

ఈ మాధవ పథమేదో పరిమళాలు రువ్వుతోంది..!
సాక్షి సాక్షి అందినపుడె సంధ్యలన్ని పండినట్లు..!

Author:

madhavarao koruprolu

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →