నీవు నడిచే దారిలాగా ఉండిపోతా.. అనుమతిస్తే..!
చెలిమివెన్నెల పువ్వులాగా మిగిలిపోతా..అనుమతిస్తే..!
గుండెకంజిర పలుకుతున్నది లక్షలేండ్లుగ ప్రేమవేదం..!
నిత్యపరిమళ సాక్షిలాగా సాగిపోతా..అనుమతిస్తే..!
మట్టికణమున చేరి మురిసే చినుకు భావన తెలుప వశమే..!
అగ్నివనమున నెమలిలాగా వెలిగిపోతా..అనుమతిస్తే..!
గాలిఎదలో సుస్వరాలకు పల్లవేదో కట్టతరమే..!
రాత్రి వీణియ చెలియలాగా మారిపోతా..అనుమతిస్తే..!
పల్లవించే మౌనవేణువు విందుచేసే రాగమేదో..!
చెక్కిలింటికి సిగ్గులాగా చేరిపోతా..అనుమతిస్తే..!
కాంతిలతలకు మాటలొచ్చిన మాధవునకు ఆనందమే..!
హంసతలపుల వానలాగా కురిసిపోతా..అనుమతిస్తే..!
Author:
Madhavarao Koruprolu |
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.