Loading...
You are here:  Home  >  Community News  >  Current Article

అందమైన నీటి అద్దం..!

By   /  July 9, 2016  /  No Comments

    Print       Email

FB_IMG_1467765740972నవ్వుతున్న ప్రాణదీప సాక్ష్యమైన నీటి అద్దం..!
నీ మనసే జన్మలుగా అందమైన నీటి అద్దం..!

చినుకుచినుకు గుండెలయల నాట్యానికి నెలవైనది..!
రాలుతున్న కాలానికి గాలమైన నీటి అద్దం..!

InCorpTaxAct
Suvidha

చిత్తవృత్తుల గానకోకిల మౌనానికి తోడైనది..!
తెప్పకొయ్య పరుగు కాచు రాగమైన నీటి అద్దం..!

అనురాగపు పరువాలకు విరితేనెల పాటైనది..!
అమృతత్వపు వెన్నెలలకు నేత్రమైన నీటి అద్దం..!

ఊయలంటి తలపువీణ తంత్రులలో ఊటైనది..!
నాదబిందు మూలాలకు క్షేత్రమైన నీటి అద్దం..!

ఈ  మాధవ చెలిమిపూలు వర్షించే వేణువైనది..!
అక్షరాలకు జోలపాడు సత్యమైన నీటి అద్దం..!

Author:

Madhav Rao Koruprolu

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →