Loading...
You are here:  Home  >  Community News  >  Current Article

సత్యంలా తోస్తుందది..!

By   /  July 9, 2016  /  No Comments

    Print       Email

FB_IMG_1459270985873ఈ ఒంటరి తనమేదో శాపంలా తోస్తుందది..!

నీ తుంటరి తనమేమో స్వప్నంలా తోస్తుందది..!
 
ఎంతకాల మీ విరహం..ఓపుటెలా వెలుతురులో..?!
ఆశ చూడు కలవరించు దీపంలా తోస్తుందది..!
 
మా వికొమ్మ కోకిలతో మాటలాడ లేకుందే..
ఆవేదన కౌగిలించు భూతంలా తోస్తుందది..!
జీవితమే చీకటిలో తిరుగాడే గబ్బిలమా..?!
కాలం ఒక గుడ్లగూబ గీతంలా తోస్తుందది..!
 
వేదాలను వల్లించే కాకికేమి తెలుసో మరి..!?
రగులుతున్న మనసుమంట నరకంలా తోస్తుందది..!
 
ఈ మాధవ గజల్ లోని సూత్రమేదొ తెలియనిదా..!
అందేనది ఒకేసారి సత్యంలా తోస్తుందది..!
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →