Loading...
You are here:  Home  >  Community News  >  Current Article

పువ్వమ్మా పరిమళించి వెళ్ళమ్మా..!

By   /  July 11, 2016  /  No Comments

    Print       Email

FB_IMG_1467804245967దూకుతున్న చినుకమ్మా కాస్త తడిపి వెళ్ళమ్మా..!
నవ్వుతున్న పువ్వమ్మా పరిమళించి వెళ్ళమ్మా..!

స్వప్నాలను పాలిస్తూ మబ్బలలో తేల్చేవే..!
ఎద మీటే స్వరధారా మనసు నిలిపి వెళ్ళమ్మా..!

InCorpTaxAct
Suvidha

కంటినుండి జారువేళ ఎందుకుప్పగుంటావో..!?
కడలిగుండె పొంగమ్మా కరువు తీర్చి వెళ్ళమ్మా..!

మట్టిపాట పరువాలకు రంగులెన్ని నింపేవో..!?
ఉట్టి మీది పాలతోడు సరిగ కలిపి వెళ్ళమ్మా..!

కురుల చాటు నిదురోయే మబ్బుకేమి తెలియదులే..!
మెరుపువీణ శృతి చేస్తూ వలపు మీటి వెళ్ళమ్మా..!

నను వీడని మాధవునకు వీడుకోలు చెప్పనీకు..!
మరులురేపు తలపువనికి తాళమేసి వెళ్ళమ్మా..!

Author:

Madhav Rao Koruprolu

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →