Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

నవ్వరాదు..కలనైనా..!

By   /  July 14, 2016  /  No Comments

    Print       Email
13254167_896390973822258_3568960880258876080_nఎదురుచూపు బహుమతిగా మిగులరాదు..కలనైనా..!
ప్రేమే ఒక శాపముగా మారరాదు..కలనైనా..!
కల కానిది ఏమున్నది జీవితాన ఓ చెలియా..!
మనసిచ్చుట నేరముగా తోచరాదు..కలనైనా..!
మాట ఇచ్చి రావైతివి..అలుసైతినె విరహానికి..!
వెన్నెలయే విషములాగ కురవరాదు..కలనైనా..!
అందమైన పరిసరాలు చెబుతున్నవి నీ ఊసులు..!
తలపు వనిని వాస్తవముగ బ్రతుకరాదు..కలనైనా..!
కలవరించు గుడి మెట్లకు జవాబసలు చెప్పుటెలా..?!
రాలి పడ్డ ఆకులాగ ఆడరాదు..కలనైనా..!
క్షణక్షణ మొక యుగముకన్న ఎక్కువగా ఉందికదా..!
ఈ మాధవ గజల్ లాగ నవ్వరాదు..కలనైనా..!

Author:

Madhav Rao Koruprolu 

 

InCorpTaxAct
Suvidha

 

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →