Loading...
You are here:  Home  >  Community News  >  Current Article

Telugu Spiritual: స్పిరిచ్యువల్ స్టో రీ..ఆధ్యాత్మిక కథ..0025″ గరం టీ’..గారంటీ..! “

By   /  August 6, 2016  /  No Comments

    Print       Email

logo2అది చాలా రద్దీగా ఉన్న సెంటర్..రోడ్డు ప్రక్కన పండ్ల బండ్లు..బస్ స్టాప్..బుక్ షాప్స్..మెడికల్ షాప్స్..జిరాక్స్..మరో ప్రక్క సినిమా హాళ్ళు..మిర్చి బండి.. టీ షెల్టర్..అప్పుడు సమయం సాయంత్రం ఐదు గంటలు..చాలా చప్పుళ్ళు..హడావిడి..
” అమ్మా..ఒక టీ..!” చెప్పిన పెద్ద మనిషి మెల్లగా ప్రక్కకి జరిగి.. చిందరవందరగా పడిఉన్న., త్రాగి పడేసిన ఖాళీ పేపర్ గ్లాసులను..ఇంకా అక్కడ పడి ఉన్న అరటి తొక్కలను..ప్లాస్టిక్ కవర్లు ఇతర చెత్త చెదారాలను ఏరి చెత్తడబ్బాలో వేస్తుంటే..
” హలో మాస్టారూ..! ఏంటి చేస్తున్నారు దయచేసి మీరాగండి..బాబుగారూ..! ”టీ అమ్ముతున్న పెద్దావిడ ముందుకొచ్చి అతని చేయి పట్టి ఆపబోయింది..!
” అమ్మా..పడేసిన వారిని అలా వేయవద్దని చెప్పావా తల్లీ..ఇప్పుడు నన్ను ఎత్తవద్దని అంటున్నావు..! ” నవ్వుతూ అంటూనే తన పని తాను చేస్తున్నారు.
” మీరుండండి సార్..నేనే రోజూ తీసి శుభ్రం చేసుకుంటాను..” ఆమె చెబుతుంటే అక్కడి తంతు చూస్తుంటే చుట్టుపక్కల ఉన్న కుర్రాళ్ళు నవ్వుతున్నారు కొందరు..ఓ ఇద్దరు కుర్రాళ్ళు మాత్రం గబగబా వచ్చేసి..” ఆగండి సర్..మేం తీస్తాం..” అని మాస్టార్ని ఆపేసి వాళ్ళు తీస్తుంటే ఇంకా కొందరు కుర్రాళ్ళు జాయిన్ అయ్యారు..అప్పుడే కాలేజీల నుండి బస్ స్టాప్ కి చేరుకున్న కొందరు అమ్మాయిలూ ఆ క్లీనింగ్ ప్రోగ్రాం లో జాయిన్ అయ్యారు..అది చూసి ఇంకా ఎందఱో పిన్నలు..పెద్దలు రోడ్డు ప్రక్క ఉన్న మిగతా చెత్త తీయడానికి తయారయ్యారు.
” మాస్టారూ..మీ టీ..! ” అన్న టీ షాప్ ఆవిడతో..
”ఓ.. టీ ఆర్డర్ చ్సాను కదూ..! ” నవ్వుతూ అనేసి చేతులు కడుక్కుని టీ అందుకున్నారాయన..!
” సర్..మీరు ఏం చేస్తుంటారు..!? ” అడిగాడో కుర్రాడు.
” ఏదో ఉద్యోగం చేస్తున్నాలే బాబూ బ్రతకడానికి..” నవ్వుతూనే చెప్పారాయన.
” మరి ఇలా అవేర్ నెస్ తేవాలని మీకెలా అనిపించింది..?! ” ఆశ్చర్యానందాలతో అడుగుతున్న ఆ కుర్రాణ్ణి..” మరి నేను చేస్తుంటే ఇప్పుడు ఎంతమంది వచ్చారు,పిలవకనే..అలాగే నేను ఒక మాస్టర్ గారిని చూసి నేర్చుకున్నాను..మిత్రమా..! ”చెప్పారాయన..!
” కానీ ఇంత బిజీ లోకంలో ఇలా ఆలోచించి జనాల్లో ఆ అవేర్ నెస్ తీసుకురావాలంటే ఎంతో చిత్తశుద్ది అవసరం కదా మాస్టారూ..!” సీరియస్ గా అంటున్న కుర్రాడితో..
” చూడు బాబూ..చిత్తశుద్ది అనే మాట చాలా పెద్దది..కావలసిందల్లా మన పట్ల మన పరిసరాల పట్ల రవంత ప్రేమ మాత్రమే..!” అనేసి ఆ టీ షాప్ ఆవిడకేసి తిరిగి..
” అమ్మా..అప్పుడప్పుడు టీ త్రాగడానికి రావచ్చా..! ” నవ్వుతూ టీ డబ్బులిస్తూ అంటున్న ఆయనకేసి అదోలా చూస్తూ..” రావచ్చు సారూ..కానీ ఇంక మీరోచ్చినప్పుడే కాదు ఎప్పుడూ ఈ చుట్టుప్రక్కల ఎలాంటి చెత్త మీకు కనబడదు సారూ నాదీ గారం’టీ’..!”చెప్పిందామె..!
” చాలా సంతోషం అమ్మా ..మీ చేతి గరం టీ..మీ గారంటీ నాకు సూపర్ గా నచ్చాయమ్మా.. వస్తాను..!” నవ్వుతూ తన టూ వీలర్ ఎక్కి వెళుతున్న ఆ పెద్ద మనిషిని అందరూ ప్రశంశాపూర్వకంగా చూసారు..!

 

InCorpTaxAct
Suvidha

 

Author:

Madhav Rao Koruprolu

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →