Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Spiritual Story: స్పిరిచ్యువల్ స్టో రీ..ఆధ్యాత్మిక కథ..0030 “ ది రియల్ మాస్టర్..! ”

By   /  August 15, 2016  /  No Comments

    Print       Email

badminton-racket-and-shuttle_97173-1600x1200అది ఒలంపిక్ క్రీడావేదిక ఏం కాదు. పెద్దగా మరి ప్రేక్షకులా.. కొన్ని కోట్లు అంటే  ఆశ్చర్యంగా ఉండచ్చు.అది దాదాపు ఒకేసారి పది టీవీ చానల్స్ లో ప్రత్యక్ష ప్రసారం అవుతోంది.జరుగుతోంది  షటిల్ బాడ్మింటన్ ఆట. ఒకవైపు ఇరవైరెండేళ్ళ కుర్రాడు..పేరు అర్జున్.భలే దిట్టంగా కండలు తిరిగి పుష్టిగా ఉన్నాడు.చెరగని చిరునవ్వు.పేస్ లో చక్కని గ్లో..సో హాండ్ సమ్ యంగ్ మాన్.మరి మరోవైపు సిక్స్టీ ప్లస్..బక్కగా ఉండి చింపిరి గెడ్డం..ఆయన పేస్ లో గ్లో ఏమాత్రం పైకి కనపడటంలేదు.

ఆ ఆటకోసం టీవీల ముందున్న జనమంతా చాలా ఉత్సాహం..ఉద్విగ్నతలతో ఉన్నారు..ఆడ్ ట్రైలర్ చూసి దానికోసం వారం రోజులుగా ఎదురు చూస్తున్నారు.ఊపిరి సయితం బిగబట్టి మరీ చూస్తున్నారు.ఇంకా గేం స్టార్ట్ కావడానికి ఒక్క నిముషం ఉంది.
బెట్టింగ్స్ విపరీతంగా జరిగాయి.
” డాడీ..ఈ ఆటలో ఎవరు గెలిచుంటారు..”అడిగాడు ‘స్వజయ్’ తండ్రి ‘ప్రజయ్’ ని..!
” నాకు మాత్రం..ఎలా తెలుస్తుంది రా..చూద్దాం ఆ పెద్దాయనే గెలవచ్చు..” కొడుకుకు కొంచెం వేడి ఎక్కించాలని అలా కావాలని చెప్పాడు ‘ప్రజయ్’
” లేదు డాడ్ అర్జునే గెల్చి ఉంటాడు..బెట్టా” నవ్వుతూ అన్నాడు ‘స్వజయ్’
” మనకు బెట్ ఎందుకు..లెటజ్ ఎంజాయ్ ద గేం..నీకేదైనా కావాలంటే నేనిస్తాగా..” తండ్రి అంటుంటే..
” లేదు డాడ్ ఇప్పుడు నేను ఏదైనా స్వయంగా గెల్చుకోవాలి..మీరు పెట్టిన నాపేరు ‘స్వజయ్’ సార్థకం చేసుకోవటం మొదలు పెట్టాలి..” హుషారుగా చెప్పాడు’స్వజయ్’..!
” అయితే బెట్టింగ్ విధానం అందుకు సరైనది కాదేమో..ఏదైనా నీ స్వయంగా సాధించి చూపాలనుకుంటా..” మెల్లగా అంటున్న తండ్రితో..
” థాట్ అండ్ ఎజంప్షన్ ఫ్రేం..డాడ్..జస్ట్ ఫర్ ఫన్..ప్లీజ్ డాడ్..” రిక్వెస్ట్ చేస్తున్న
‘స్వజయ్’ తో
 ” ఓకే మై సన్..చూడు ఆట మొదలైంది..చెప్పానుగా పెద్దాయనకే నా ఓటు..”చెప్పాడు ప్రజయ్..!
” నేను అర్జున్ పార్టీ..” అనేసి తల్లి తన చేతికిచ్చిన టిఫిన్ ప్లేట్ తీసుకున్నాడు ‘స్వజయ్’..!
మరి ఇలా ఇంకా ఎన్ని రకాలుగా టీవీల ముందు ఉన్నారో ప్రేక్షకులు.
కుర్రాడు అర్జున్ టాస్ నెగ్గాడు..మరి ‘స్వజయ్..’ పార్టీ కేరింతలు చెప్పనలవి కాదు.
‘అర్జున్’ కోర్ట్ తీసుకుని పెద్దాయనకు గౌరవంగా సర్వీస్ ఇచ్చాడు.
చూసే వాళ్ళందరికీ వండర్.
పెద్దాయన సర్వీస్ చేసారు ఫెయిర్ గా..అర్జున్ సింపుల్ షాట్ కొట్టాడు..పెద్దాయన కూల్ గా రిప్లై ఇచ్చారు..మూడు సార్లు అర్జున్ షాట్ కొట్టడం.మూడు సార్లూ మాస్టారు చక్కగా రిటర్న్ చేయటం జరిగాక అంపైర్ స్టాప్ చెప్పి ” స్టార్ట్ రియల్స్ ” అన్నాడు విజిలేస్తూ..
చింపిరి గెడ్డం పెద్దాయన సర్వీస్ చేసారు చాలా ఫెయిర్ గా..మరి హాండ్ సమ్ అర్జున్ షాట్ కొట్టాడు..ఘాటుగా..!
అరగంట గడిచినా ఎక్కడా ఎవరికీ పాయింట్ లేదు. కాక్ కింద పడితే కదా..! ప్రతి సారి అర్జున్ షాట్..పెద్దాయన రిప్లై..చాలా డీసెంట్ గా సాగుతోంది మాచ్.వేసిన చోట వేయకుండా ప్లేస్ వేస్తున్నారు పెద్దాయన. కొట్టిన చోటికి కొట్టకుండా షాట్ పైన షాట్ కొడుతున్నాడు అర్జున్. ఇదెలా సాధ్యం..అని అందరూ చాలా చాలా ఇంట్రస్టింగ్ గా చూస్తున్నారు.
అర్జున్ కి కొట్టి కొట్టి చెమటలు వచ్చేసాయి.మొహం కాస్త నల్లబడింది.అతను తప్పక ఓడిపోతాడని ఏ సెకన్ లోనైనా ఇక జరగవచ్చని ఊహాగానాలు జరుగుతున్నాయి.
మరి అదే క్షణంలో అర్జున్ ఉన్న ఫళంగా ఓ ప్రక్కకి వాలాడు. పెద్దాయన మెల్లగా దగ్గరికి చేరి ”కమాన్ అర్జున్ లే గెటప్..నువ్వు గెలవాలి.. కమాన్..కమాన్..” అనేసరికి ప్రేక్షకులకు మతిపోయినంత పనైంది. ఏం జరుగుతోందసలు..ఎవరికీ అర్థం కాలేదు.
” అర్థమైందా..” అడిగాడు ‘ప్రజయ్’..’స్వజయ్’ని..!
” నో డాడ్..” స్వజయ్ అంటుండగానే ‘అర్జున్’ లేచాడు అదేదో బాక్సింగ్ లో మాదిరి..
మళ్ళీ ఆట మొదలైంది. అలాగే పెద్దాయన సర్వీస్ ‘అర్జున్’ షాట్..మరో అరగంట సాగింది వాళ ఆట చాలా జోరుగా.మళ్ళీ ‘అర్జున్’ వాలాడు నేల మీద..!
పెద్దాయన కొన్ని నీళ్ళు తీసుకుని ‘అర్జున్’ మొహం మీద చల్లి..కొన్ని నీళ్ళు త్రాగించి..కూర్చోబెట్టి..
” గేం నువ్వే గెలిచావ్ అర్జున్..!” నవ్వుతూ మాస్టారు అంటుంటే..
” లేదు మాస్టర్..లేదు..అసలు గెలుపు ఓటములెక్కడున్నాయ్..ఉన్నదంతా ఆటే కదా..! ” అర్జున్ మాటలు ప్రేక్షకులకు సినిమా డైలాగ్ లా తోచి నవ్వుకున్నారు.
” యస్ అర్జున్..అది నిజమే..ఈ ప్రపంచం దృష్టిలో గెలుపు..ఓటమి ఉంటాయి ఉండాలి..ఐతే షాట్ ఎలాంటిదైనా ఎటునుండి వచ్చినా షాక్ అవకుండా ప్రశాంతంగా రిటర్న్ చేయాలంటే అవసరమయ్యేదే ‘ప్రజ్ఞ’..! షాట్ కొట్టడం బాగా ప్రాక్టీస్ చేసావ్ ఇక రిప్లయ్ ఇవ్వడం ప్రాక్టీస్ చేద్దూగాని..” సన్నగా నవ్వుతూ భుజం తట్టి కౌగిలించుకున్నాడు పెద్దాయన అర్జున్ కోచ్..” ది రియల్ మాస్టర్..”
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →