Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Telugu Spiritual: స్పిరిచ్యువల్ స్టో రీ..ఆధ్యాత్మిక కథ..0031 “ మేలిమి బంగారం..”

By   /  August 17, 2016  /  No Comments

    Print       Email

IMG_20160806_073348_740” హలో..బంగారూ..! నీ పేరేమిటి..!? ” జస్ట్ అప్పుడే ట్రైన్ ఎక్కి తన ఎదురుగా కూర్చున్న సుమారు ఇరవై ఏళ్ళ అమ్మా యిని ఓ ఫిఫ్టీ ప్లస్ మాన్..అడిగాడు.
” బంగారూ అన్నారుగా అంకుల్..అలానే పిలవండి..మీ పిలుపు నాకు నచ్చింది.” కాస్త చామన ఛాయలో ఉన్నా హుషారుగ మెరుస్తున్న కళ్ళతో చెప్పింది.
” సరేలేమ్మా..పిల్లలందరినీ నేనలానే పిలుస్తాను..ఆడపిల్లల్ని వయసు అడగకూడదు గాని..పేరు కూడా అడక్కూడదా కన్నా..!? ” ఆయన అడిగిన తీరుకు..
” అయ్యో..అదేంలేదంకుల్..నా పేరు కీర్తి..! ” చెప్పింది సంతోషంగా.
” క్రొత్తవాళ్ళతో అందునా ఓ అమ్మాయితో మరి సూటిగా ఏ పరిచయం లేకుండా చూడగానే అంత చనువుగా బంగారూ అని పలకరించారంటే..మీరు చాలా గొప్పవారే అయ్యుండాలి..!” మరలా తనే అంది ఆశ్చర్యంగా..!
” అవునా మరి ఎదుటి వారి గొప్పతనాన్ని గుర్తించేంత విషయం వున్న వాళ్ళు ఇంకెంత గొప్పవారై వుండాలి..!”అన్నారాయన.
“మీరు చాలా తమాషాగా నన్ను గొప్పదాన్ని చేసేస్తున్నారు..” నవ్వుతూ అంది కీర్తి.
” అది సరే ఇంతకీ నువ్వేం చేస్తున్నావమ్మా..!? ”
” డాన్స్ లో డిగ్రీ అంకుల్..”
” ఓ..రియల్లీ వెరీ గ్రేట్..మరి డాన్స్ తో ఏం సాధించాలని..?!”
“నాకు తెలియనిది ఏదో నాలో వుంది..! ”
కీర్తి చెబుతున్న తీరులో అతను ఊహించింది ఏదో కనిపించింది.
” ఓ వండ్రఫుల్..మరి నీవు నాన్ వెజ్ తినటం మానేయాలమ్మా..” ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ చెప్పారాయన..!
” అదేంటంకుల్ అంత ఖచ్చితంగా మీకు తెలిసినట్టు చెబుతున్నారు..నేను నాన్ వెజ్ తింటానని నా మొహాన రాసి వుందా..!? నేను ఎప్పుడో రేర్ గా తింటానంకుల్..అదీ…..” అని ఇంకా ఏదో చెప్పబోతుంటే..
” చూడు తల్లీ కీర్తీ..నీకు నీ బొట్టు పెట్టుకునే జాగాలో ఈ మధ్య చాలా  రోజులుగా బాగా నెప్పి వస్తోంది కదా..!” ఆ పెద్దాయన అడుగుతుంటే..
” ఓ అంకుల్ మీకు దణ్ణం పెడతాను..అవును నిజంగానే వస్తోంది..అసలు మీరెవరు..మీకు నేను ఎలా తెలుసు..నా మొహం ఏమైనా తెరిచిన పుస్తకంలా వుందా ఏంటి..!? ”
రెట్టింపు ఆశ్చర్యంతో అడిగింది కీర్తి.
ఇక ఆ తరువాత వారిద్దరూ ఓ పదిహేను నిముషాలు ఎన్నో విషయాలు మాట్లాడుకున్నారు.
కీర్తి అతను చెప్పిన విధంగా కొన్ని మంచినీళ్ళు తాగి కళ్ళు మూసుకు కూర్చుని ఆయన చెప్పే మాటలు వింటూంది.
ట్రైన్ లో ప్రక్కనున్న వారు అసలు వారికేం పట్టనట్టు వాళ్ళ పనుల్లో వాళ్ళున్నారు.
సరిగ్గా పదిహేను నిముషాల పిదప ఆయన సూచన మేరకు కీర్తి కళ్ళు తెరిచి..” రియల్లీ వండ్రఫుల్ మాస్టర్..కానీ ఇంకా అదే..బొట్టు పెట్టుకునే చోట నెప్పి ఎక్కువైందేమిటి..!? “అడిగింది ఉత్సాహంగా.
” చూసావా నీలో భయం లేదు..జిజ్ఞాస వుంది..ఇంట్రస్ట్ కనిపిస్తోంది..అందుకే గ్రేట్ మాస్టర్స్ వీడి ద్వారా నిన్ను సెలక్ట్ చేసుకున్నారు. ఇక విను బొట్టు పెట్టుకునే ఆ చోటును ఆజ్ఞాచక్రం అంటారు..ఆ.. అంటే ఆరోగ్యం,ఆనందం,ఆత్మ,ఆచరణ..జ్ఞా..అంటే జ్ఞానం..ఈ నాలుగు రకాల జ్ఞానం కళ్ళు మూసుకుని ఆ స్థానంలో గమనించటం వల్ల వచ్చేస్తాయి. అదీ సంగతి వీడి ద్వారా మాస్టర్స్ వారి పని చేసుకుపోతున్నారు. దానినే  మూడవనేత్రం అంటారు..అది ఓపెన్  అయేముందు అలానే  నెప్పి వస్తుంది..అది తెరుచుకోబోతోంది.. వారు ఎంచుకున్న వండ్రఫుల్ మాస్టరే నువ్వు..ఇప్పుడు నీకు దాహం..” ఆయన మాట పూర్తి కాకముందే కీర్తి వాటర్ బాటిల్ తీసుకుని నీళ్ళు కొన్ని త్రాగుతూ..
” అవునంకుల్ చాలా వేడిగా..దాహంగా అనిపించింంది..!” చెప్పింది కీర్తి.
“ఇదుగో నీకో గిఫ్ట్ “అంటూ  ఓ మాగజైన్ ఆమెకు ఇచ్ఛారాయన.
ఆ పత్రిక ముఖచిత్రం చూస్తూనే..
” వావ్ ఓ మాస్టర్..ఇప్పుడు కళ్ళు మూసుకున్నప్పుడు ఈ మాస్టర్ గారు కనిపించారు చాలాసేపు..వీరెవరూ..!? నాకెందుకు కనిపించారసలు..!? “కళ్ళింతలు చేసి అడిగింది కీర్తి.
” మరి అదీ అసలు సంగతి ఆ మాస్టారే నిన్ను సెలక్ట్ చేసుకుంది..! అది చదువుకో నిదానంగా నీకే అర్థమౌతుంది..!ఓకే..” అని ఇంకా ఎన్నో సంగతులు తన అనుభవాలు చెప్పి ” వినే వారు లేకపోతే నేనెవరికి చెప్పేవాణ్ణి..సో నీవే కదా బంగారూ..మేలిమి
“బంగారం..!” అంటుంటే కీర్తికి తన కర్తవ్యం బోధపడింది.
మౌనంగా తల పంకిస్తూ మాస్టారిచ్చిన మాగజిన్ లోకి నిర్మల గంభీరంగా తల దూర్చింది..!

 

InCorpTaxAct
Suvidha

 

Author:

Madhav Rao Koruprolu

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →