Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Telugu Spiritual: స్పిరిచ్యువల్ స్టో రీ..ఆధ్యాత్మిక కథ..0032 “స్టార్టింగ్ పాయింట్ .!”

By   /  August 22, 2016  /  No Comments

    Print       Email

Charminar_WAP7చార్మినార్ ఎక్స్ ప్రెస్ చెన్నై టూ హైదరాబాద్..ఇంకా ఓ అరగంటలో సికింద్రాబాద్ చేరుకోనుంది..
42 సైడ్ లోయర్ బెర్త్ టూటైర్ ఏసీ లో సుమారు ఓ  గంట పైగా ధ్యానంలో  కూర్చున్న మాస్టర్ ‘స్వరోచి’.. ఓ చిన్న పిల్లవాడి సంభాషణ వింటూ మెల్లగా కళ్ళు తెరిచాడు.
మూడేళ్ళు నిండా ఉన్నాయో లేవో వాడికి.
” డాడీ మీరు ఎక్కడ..స్టేషన్ కి వచ్చారా.. మేము ఫిఫ్టీన్ మినిట్స్ లో..సికింద్రాబాద్ లో దిగేస్తాం..” అనేసి వాళ్ళ మమ్మీతో..
” మమ్మీ మమ్మీ నా కార్ ఇవ్వా..ప్లీజ్ ..” అడిగాడు..ముద్దుగా..
వాడి అమ్మమ్మ తాతగార్లు  ఎదురుగా సీట్లో ఉన్నారన్న సంగతి ఆ తాతగారు ” ఇప్పుడొద్దు నాన్నా కారు ఎక్కడ ఆడుకుంటావ్..పాడైపోతుంది..!” అంటుంటే వాడి అమ్మమ్మగారు ” అవునుకదా వద్దు విజ్ఞేష్ ..విరిగిపోతుంది..” అనేసరికి మరి ఫిఫ్టీ ప్లస్ ఉన్న స్వరోచి చిన్నగా తనలో తాను నవ్వుకున్నాడు. విజ్ఞేష్ తల్లి మెల్లగా ఒక చిన్న ‘ఎలక్ట్రానిక్ రిమోట్ కారు’ చిన్న బాక్స్ లో పాక్ చేసి ఉన్నది ఓ బాగ్ లోంచి తీసి ఇచ్చి జాగ్రత్తలు చెబుతుంటే..
” చూడండి వాడికి మీరు ‘విజ్ఞేష్’ అని పేరెందుకు పెట్టారో తెల్సా..!” అడిగాడు ‘స్వరోచి’ మెల్లగా..!
” అదేంటి ఎందుకలా అడుగుతున్నారు..మీరేం చేస్తుంటారు..మీ పేరేంటి..?! ” అడిగాడు పిల్లాడి తాతగారు.
” మీ ప్రశ్నలకేమిగాని..నాకింకా ఫైవ్ యియర్స్ సర్వీస్ ఉంది..సర్. పిల్లలకి చక్కని పేర్లు పెడతాం..వాళ్ళ పట్ల అతి శ్రద్ధ వహిస్తాం.దాంతోనే ప్రమాదాలు పొంచి ఉంటాయి.వాడు ‘విజ్ఞేష్’..
చక్కని విజ్ఞత ఉన్నవాడు.వాడి విజ్ఞతను ఎందుకు సందేహిస్తారు.పిల్లలకు ఎంత స్వేఛ్చ ఇస్తే అంత గొప్పగా రాణిస్తారు.అలా మనం వాళ్లని ఇబ్బంది పెట్టకూడదు..వాళ్ళు మన పిల్లలు.
వాళ్ళెందుకు భయపడుతూ బతకాలసలు..” అంటున్నంతలో ఆ విజ్ఞేష్ తిరిగి ఆ కారును..యదావిధిగా దానిని దాని బాక్స్ లో పెట్టి ఇచ్చేసాడు వాళ్ళమ్మకి.
”  మీరనేది కరెక్టే మాస్టర్ మరి పేరంట్స్ గా మనకు వారి పట్ల ఆ భయం సహజం కదా..!” అన్నారు వాడి తాతగారు.
” సహజమైన భయం కాదు సార్..ఓవర్ కన్సర్న్ ఎబౌట్ ద చిల్డ్రన్ అండ్ ద ఐటమ్.అంతేకాదు..వాళ్ళు ఇలా వుండాలి ఫలానా చోట ఫలానా టైమ్ కే తినాలి..ఆడాలి..చదవాలి అని మనం శాసిస్తుంటాం..ఇది తప్పు..అది తప్పు..అలాక్కాదు..ఏయ్ ఏంటా పని..ఇలా రకరకాలుగా భయపెడుతూ కోప్పడుతూ వుండటం వల్ల పిల్లలు దారి తప్పటం జరుగుతుంది.వారికి స్వేచ్ఛను ఇవ్వటం కాదు వారి స్వేచ్ఛకు ఇబ్బంది కలగకుండా ఎదగనివ్వాలి..” నవ్వుతూ చెబుతుంటే విజ్ఞేష్ తల్లి..
” యస్ సర్ వెల్ సెడ్..ట్రైచేయాలి మీరు చెప్పిన విధంగా..” అంటూండగా..
” విజ్జూ మీ స్కూల్ పేరేంటి..?!” అడిగారు వాడి తాతగారు.
” నేను చెప్పనుగా..” అన్నాడు విజ్ఞేష్.
” చెప్పాలమ్మా తాతగారు కదా అడిగారు..”అన్నది విజ్ఞేష్ మదర్.
” మీ స్కూల్ పేరు నాకు తెలుసుగా..”అన్నాడు స్వరోచి నవ్వుతూ దీర్ఘం తీస్తూ..అంతే విజ్ఞేష్ పిలవకనే స్వరోచి దగ్గరికి వచ్చి..” తెలుసా మాస్కూల్ నేమ్ మీకు..చెప్పండి అయితే..” ఆశ్చర్యంగా అడిగాడు.
విజ్ఞేష్ రెండు చేతులు పట్టుకుని చక్కగా ఊపుతూ..
” నేను చెప్పనుగా..” నవ్వుతూ అనేసరికి..
” మా స్కూల్ పేరూ..సెంట్ ఆల్ఫాన్స్..” చెప్పాడు విజ్ఞేష్..!
” అరె భలే చెప్పించారే వాడి చేత..” నవ్వుతూ అంది వాళ్ళమ్మ.
” అలాగంటే వాడు చెప్తాడని నాకేం తెలియదు..మనమూ వాళ్ళలాగా అవటం ముఖ్యం..”చెబుతుంటే..
” అది చాలా కష్టం కదా సర్..!” అందామె.
” చాలా సులభం తల్లీ..! ఎవరైనా ఏదైనా బలంగా కావాలనుకోవాలంతే..!”
” సర్ మీ ఫోన్ నంబర్ ప్లీజ్..! “ఆమె అడిగింది.
స్వరోచి ఓ కాగితం మీద వ్రాసి ఇచ్చాడు తన పేరు ఫోన్ నంబరు.
” థాంక్యూ మాస్టర్ విల్ కాల్..మీరోసారి మా ఇంటికి రావాలి..” ఇన్వైట్ చేసింది విజ్ఞేష్ మదర్.
” అలాగే తప్పకుండా విల్ కమ్..”
అప్పటికే సికింద్రాబాద్ వచ్చేసి చాలా మంది ట్రైన్ దిగటం కూడా జరిగింది.
స్వరోచికి వాళ్ళందరూ థాంక్స్ చెబుతూ దిగుతుంటే విజ్ఞేష్ కూడా ” థాంక్యూ తాతా బై..మా ఇంటికి రావాలీ..”చెప్పాడు నవ్వుతూ.
తానూ నవ్వుతూ తల వూపి సెలవ్ తీసుకున్నాడు.అలా మరి ఆ జర్నీ ఎండింగ్ పాయింటే ఆ ఫామిలీ స్పిరిచ్యువల్ జర్నీకి స్టార్టింగ్ పాయింట్.

 

InCorpTaxAct
Suvidha

 

Author:

Madhav Rao Koruprolu

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Parody Song from movie on aakali raajyam to fight Corona-virus

Read More →