Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Telugu Spiritual: స్పిరిచ్యువల్ స్టో రీ..ఆధ్యాత్మిక కథ..0034 “సంభవామి.!”/ “దటీజ్ మాన్య “

By   /  August 27, 2016  /  No Comments

    Print       Email

FB_IMG_1466311805935“యథా యథాహి..ధర్మస్య..గ్లానిర్భవతి భారతా..!
ధర్మ సంస్థాపనార్థాయ..సంభవామి యుగేయుగే..!”

ఈ శ్లోకాన్ని పదే పదే రాగయుక్తంగా పాడుకుంటోంది ఇంటి ముందున్న పూలమొక్కలకు నీళ్ళు పోస్తూ సెవంత్ మంత్ ప్రిగ్నెంట్ గా వున్న ” మాన్య”..!
మరి అప్పుడే బైక్ పార్క్ చేసి లోనికి రాబోతున్న “సద్ధర్మ్” ఆమె హజ్బెండ్ తన మాన్య మృదువైన గొంతు విని అక్కడే ఆగాడు..!
ఓ అరగంట పైగా గడిచింది.అప్పడు టైం సాయంత్రం 6 గంటలు దాటింది. మాన్య ఆ శ్లోకాన్నే ఇంకా ఇంకా మధురాతి మధురంగా పాడుతోంది..కాదు కాదు ” పాడుకుంటోంది..!”
మాన్య ముఖంలో క్రొత్త వెలుగు తనను వండర్ చేస్తోంది.
“ఆమెలో ఏదో జరుగుతోంది.గమనించాలి..! “అలా అతను అనుకునేంతలో..
” హలో ధర్మా ఇదేనా రావటం..వాటార్ యూ థింకింగ్ మాన్..!? “నవ్వుతూ అనేసి లోనికి దారి తీస్త్తూ..
” కాఫీ తాగుదామా..! ఓకే..!? ” అంటుంటే..తన ఆలోచన పైకి కనపడనివ్వకుండా..
” యస్..తప్పకుండా..నేను ఫ్రషై రానా..!? “అనేసి టవల్ తో బాత్ రూమ్ లో దూరాడు ‘సద్ధర్మ్’.
అలా ఓ వారం ఎలా గడిచిందో..
” మాన్యా నీకు అబ్బాయి కావాలా అమ్మాయా..!”
కాఫీ తాగుతూ అడిగితే వింతగా నవ్వి..
” తినబోతూ రుచడిగినట్టుంది..ఇంతకీ కాఫీలో షుగర్..”
” సరిపోయిందా అని అడగాలా..నీ చేత్తో ఇస్తే..”
” అయ్యో ధర్మా..ఏంటా అరిగిపోయిన పాత సినిమా డైలాగ్ లా..”పకపకా నవ్వుతుంటే..
” అరె మాన్యా..మాట మార్చక జవాబు చెప్పరా..అబ్బయా..అమ్మా..యా..” అనబోతుంటే..
” ఓ మై గాడ్..బాబోయ్ ధర్మా ఏంటో నెప్పి అమ్మా నెప్పి..నెప్పి..ప్లీజ్ ఆటోనో కాబో పిలవ్వా..!” మెలికలు తిరుగుతూ అంది మాన్య.క్షణాల్లో ఆటో వచ్చేసింది.రెగ్యులర్ హాస్పటల్ కే వెళ్ళారు క్షేమంగా.నెప్పులు కొెచెం తగ్గాయి.రెగ్యులర్ లేడీ డాక్టరే వచ్చి చూసింది.
” నో ప్రాబ్లెం బాబూ..మాన్యా రిలాక్స్..బహుశా మిడ్ నైట్ వరకు డెలివరీ అవచ్చు..నార్మలే..!” కానీ ఇలా చాలా రేర్ గా జరుదుతుంది మాన్యా..!” చెప్పింది డాక్టర్.
” ఇంతకీ అబ్బాయా..అమ్మాయా..!?”అడిగాడతను చిన్నపిల్లాడిలా..!
” నాకు చెల్లి కావాలి ” అని అడిగే పసివాడిలా..!డాక్టర్ నవ్వి ” నీకు ఎవరు కావాలో వాళ్ళే పుడతారు మిస్టర్..డోంట్ వర్రీ..నేను దగ్గరుండి చూసుకుంటాగా..రిలాక్స్ ” చెప్పి వెళ్ళిందామె.
***      ***       ***     ***       ***     ***     ***
మాన్య..సద్ధర్మల పుత్ర రత్నానికి జస్ట్ త్రీ ఇయర్స్.అది కృష్ణాష్టమి పర్వదినం.ఇప్పుడు వాళ్ళున్నది ఆస్ట్రేలియాలో.మరి అక్కడ ఓ వేదిక మీద చిన్ని కృష్ణుడి వేషం కట్టి భగవద్గీతా శ్లోకాలు వందకు పైగా రాగయుక్తంగా ఎంతో స్పష్టంగా పాడి ప్రథమ బహుమతి గెల్చుకున్నాడు.వాడి పేరు పిల్చారు బహుమతి అందుకోవటానికి..” మిస్టర్ ‘సంభవ్’ సన్ ఆఫ్ ది గ్రేట్ పేరంట్స్ మిస్టర్ సద్ధర్మ అండ్ మాన్య ప్లీజ్ వెల్కమ్..కమాన్ టూద డయాస్..త్రీ టూ టెన్ ఇయర్స్ విభాగంలో మరి ఓన్లీ త్రీ ఇయర్స్ కిడ్..వాటే వండర్ కిడ్ మేడ్ ఏ హిస్టరీ టుడే..” అంటుంటే ” సంభవ్..సంభవ్..సంభవ్..!” ఆ హాలంతా ‘సంభవ్’ పేరుతో మారుమ్రోగింది.మరి ‘సంభవ్’ ఇంకేం చేస్తాడో వేచి చూద్దాం.

InCorpTaxAct
Suvidha

Author:

Madhav Rao Koruprolu

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

GATeS 15 th Anniversary and Telangana Formation Day Celebrations

Read More →