Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

స్పిరిచ్యువల్ స్టో రీ..ఆధ్యాత్మిక కథ..0015.”బ్రహ్మ రహస్యం !”

By   /  July 22, 2016  /  No Comments

    Print       Email

imageసినిమాల్లో నటించాలని..సినీ నిర్మాత కావాలని రెండే రెండు బలమైన కోరికలున్నాయి ‘సీను’గాడికి..! ఓ ఆర్నెల్లు సర్వే చేసాడు..చేతిలో ఓ యాభై లక్షల కాష్ ఉంది వాడి దగ్గర..

” ఏం చేస్తున్నావ్ రా సీనుగా..” అడిగాడు ఫోన్ లో క్లోజ్ ఫ్రండ్ వెంకీ..!
” కొన్ని హిట్ సినిమాలు సెలెక్ట్ చేసుకు రిపీటెడ్ గా చూస్తున్నారా..ఇంకా మంచి డైరెక్టర్ కోసం వెదుకుతున్నారా.. ” సీరియస్ గా చెప్పాడు ‘సీను’..!
” సినిమా తియ్యాలంటే డబ్బులుంటే చాల్రా..హిట్ కొట్టాలంటే ఫెయిల్యూర్ సినిమాలు బాగా చూడాల్రా..” చెప్పాడు ‘వెంకీ’ జోరుగా నవ్వుతూ..!
” హుషారైన హిట్స్ చూస్తుంటే..మజాగా ఎనర్జటిక్ గా ఉంటుంది కానీ నువ్వెంటీ ఫ్లాప్స్ చూడమంటావ్..పోరా..! ” అన్నాడు వ్యంగ్యంగా ‘సీను’..!
” ఒరేయ్..నీతో నాకు జోకేంటి..సీరియస్ గా చెప్తున్నారా..ఫ్లాప్స్ రిపీటెడ్ గా చూస్తే..వీక్ పాయింట్స్ దొరుకుతాయిరా..మళ్ళీ ఆ తప్పులు మనం చేయకుండా పనికొస్తాయ్..! ” అంటున్న వెంకీ మాటల్లో నిజాయితీ ప్లస్ విషయం అర్థమయింది ‘సీను’కి..
” ఒరేయ్..యూ ఆర్ రైట్..రా..! వెంకీ..అసలు సినిమా హిట్ కొట్టాలంటే ఒక గొప్ప కాన్ఫిడెన్స్ కావాల్రా..ఓ ట్రెండ్ సృష్టించాలనే తపన..క్రియేటివ్ థింకింగ్ చాలా కావాల్రా..ఇంతకీ నీ డైరెక్టర్ ఎవరని అడగవేంరా..! ” నవ్వుతూ అడిగాడు ‘సీను’.
” ఇంకా వేటలో ఉన్నానన్నావుగా..” అన్నాడు వెంకీ..
” మన మాటల్లోనే దొరికాడ్రా..! ” ఎంతో పవర్ ఫుల్ గా ఉన్న ‘సీను’ మాటలకు..
” అవునా ఎవడ్రా వాడు..! ” ఆశ్చర్యంగా అడిగాడు ‘వెంకీ’
”చెప్పుకో చూద్దాం..” బిగ్గరగా నవ్వుతూ అడిగాడు ‘సీను’
” నాకంత సీన్ లేదు గాని చెప్పరా సీనూ..! ” సన్నగా నవ్వాడు ‘వెంకీ’..!
” రారా..మరి కమాన్.. స్టోరీ డిస్కషన్ కి..”
” నేనా దేనికీ..!? ”అడిగాడు ‘వెంకీ’ అనుమానంగా..
” బ్రహ్మ రహస్యం అందించిన నా ‘వెంకీ’నేరా.. నా డైరెక్టర్..! ”
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →