తెలుగు, తమిళ భాషల వల్లే గిన్నిస్ రికార్డ్ సాధించగలిగా: పి. సుశీల
తెలుగు, తమిళ భాషల వల్లే గిన్నిస్ రికార్డ్ సాధించగలిగానని ప్రముఖ నేపథ్యగాయని, పద్మభూషణ్ పి.సుశీల అన్నారు. గిన్నిస్ రికార్డు సాధించడంతో .. ఆమెను చెన్నైలోని వేల్టెక్ వర్శిటీ నిర్వాహకులు బుధవారం ఘనంగా సన్మానించారు. తర్వాత వర్శిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ‘స్కూల్ ఆఫ్ మీడియా టెక్నీలజీ అండ్ కమ్యూనికేషన్’ విభాగాన్ని సుశీల లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. 1950లో ఆంధ్రప్రదేశ్ నుంచి చెన్నై వచ్చిన తనను తమిళులు ఎంతో అభిమానించారని అన్నారు. అలాగే తనను విశ్వగాయనిగా చేశారన్నారు. తెలుగు, తమిళ పాటల వల్లే తాను ఈ రికార్డులు ఎక్కగలిగానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వేట్లెక్ వర్శిటీ వ్యవస్థాపకులు ప్రొఫెసర్ వేల్ రంగరాజన, వైస్చైర్మన డాక్టర్ శకుంతలా రంగరాజన్, డాక్టర్ మహాలక్ష్మి, వైస్ ఛాన్సలర్ డాక్టర్ సత్యనారాయణ, ప్రొ ఛాన్సలర్ డాక్టర్ వి.చంద్రశేఖర్ పాల్గొన్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.