Loading...
You are here:  Home  >  World News  >  Asia News  >  Current Article

The heavily Indian army is deployed at Doklam

By   /  August 12, 2017  /  Comments Off on The heavily Indian army is deployed at Doklam

    Print       Email

డోక్లాం దగ్గర భారీగా భారత సైన్యం మోహరింపు..?

 

Suvidha
Biryani Pot

 

 

సిక్కిం సరిహద్దుల్లో డోక్లాం దగ్గర భారత్-చైనా మధ్య వివాదం చెలరేగుతోంది. గత రెండు నెలలుగా డ్రాగన్ కంట్రీ హెచ్చరికలు చేస్తూనే ఉంది. అలాగే పలుమార్లు కవ్వింపు చర్యలకు కూడా పాల్పడుతోంది. దీంతో చైనా హెచ్చరికలకు సమాధానం చెప్పేందుకు ఇండియా రెడీ అవుతోందని సమాచారం. సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ లోని చైనా సరిహద్దులకు పెద్ద ఎత్తున సైనిక బలగాలను పంపించిందని కొన్ని వార్తా సంస్థలు పేర్కొన్నాయి. అయితే ఈ అంశంపై ఇండియన్ ఆర్మీ అధికారులు స్పందించ లేదు. దీనికి కారణం ఆర్మీ అంతర్గత వ్యవహారాలు లీక్ చేయకూడదనే ఉద్దేశ్యమేనని సమాచారం.

విస్తరణ కాంక్షతో రగిలిపోతున్న చైనా.. డోక్లాం తమ భూభాగమేనని బుకాయిస్తోంది. అక్కడ రోడ్డు నిర్మాణం చేపట్టాలని భావిస్తోంది. అది భారత్, భూటాన్, చైనా ట్రై జంక్షన్ కావడంతో భారత్ చైనా చర్యలను అడ్డుకుంది. దీంతో చైనాకు ఆగ్రహం పొడుచుకొస్తోంది. భారత్ పై తీవ్ర విమర్శలు, హెచ్చరికలు చేస్తోంది. ఇండియన్ ఆర్మీ వెనక్కు వెళ్ళాలని లేదంటే యుద్ధం అనివార్యమని హెచ్చరిస్తోంది. అయితే భారత్ మాత్రం సమస్యను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని సూచిస్తోంది. అయితే కొండనైనా కదలించవచ్చు గాని చైనా ఆర్మీని కదిలించలేరని తేల్చేసింది. దీంతో చైనా హెచ్చరికలకు సమాధానం చెప్పేందుకు భారత్ సిద్ధమవుతోందని సమాచారం.

Charter Global
Swapna
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Shikar Dhawan century, India won first T20

Read More →