Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

The Supreme Court has criticised the Central govt. for the protection of schools

By   /  August 13, 2017  /  Comments Off on The Supreme Court has criticised the Central govt. for the protection of schools

    Print       Email

స్కూళ్ళ భద్రత విషయంలో కేంద్రాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు..

 

EIS
EnGeniusInc

 

స్కూళ్ళ భద్రతకు సంబంధించి ఖచ్చితమైన మార్గదర్శకాలు రూపొందించకపోవడంపై కేంద్రాన్ని సుప్రీంకోర్టు తప్పబట్టింది. తమిళనాడులోని కుంభకోణం, హరియాణాలోని డబ్వాలీ స్కూళ్ళలో జరిగిన ఫైర్ యాక్సిడెంట్స్ లో చాలా మంది చిన్నారులు మరణించారు. అయినా విపత్తు నిర్వహణకు సంబంధించిన మార్గదర్శకాలు ఖరారు చేయకపోవడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. స్కూళ్ళ భద్రతపై మార్గదర్శకాలు రూపొందించాలనుకుంటురా లేదా అన్నది తెలియజేయాలంటూ ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.ఈ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది.

విపత్తు నిర్వహణలో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థతో పాటు రాష్ట్ర, జిల్లా స్థాయిలోని విపత్తు నిర్వహణ సంస్థలు చూసుకుంటాయని కోర్టుకు కేంద్రం విన్నవించింది. ఆయా సంస్థలన్నీ ఈ నెల 14 లోపు వివరణ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. స్కూళ్ళ భద్రతపై మార్గదర్శకాలు రూపొందిస్తే సరిపోదని తెలిపింది. వాటిని ఖచ్చితంగా అమలు చేయడంపై దృష్టిపెట్టడం అత్యవసరం అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Charter Global
InfoSmart
Swapna
InCorpTaxAct
    Print       Email

You might also like...

TATA – (Telangana American Telugu Association) – Bathukamma and Dussara sambaralu

Read More →