అమెరికా కాంగ్రెస్ లో ‘ది యూఎస్ కాల్ సెంటర్ అండ్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ‘..
కాల్ సెంటర్ జాబ్స్ ను ఔట్ సోర్సింగ్ ఇవ్వడంపై అమెరికా ప్రభుత్వం అక్కడి కంపెనీలకు అడ్డుపడుతోంది. ఔట్ సోర్సింగ్ ఇచ్చే కంపెనీలకు గ్రాంట్లు, రుణాలు మంజూరు కాకుండా ఉండేలా మరోసారి బిల్లును అమెరికా కాంగ్రెస్ లో ప్రవేశపెట్టింది. ఇతర దేశాలకు ఉద్యోగాలు తరలిపోకుండా ఉండేందుకు ఆ దేశ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.ది యూఎస్ కాల్ సెంటర్ అండ్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అనే బిల్లును డెమెక్రటిక్ పార్టీకి చెందిన జీన్ గ్రీన్ , రిపబ్లికన్ పార్టీకి చెందిన డేవిడ్ మెక్ కిన్లే కాంగ్రెస్ లో ప్రవేశపెట్టారు.
అమెరికా ఉద్యోగాలు ఇతర దేశాలకు తరలిపోకుండా చూడటమే ఈ బిల్లు ఉద్దేశ్యం. ఈ బిల్లు పాస్ అయితే.. ఔట్ సోర్సింగ్ ఇచ్చే కంపెనీలను లిస్ట్ తయారు చేస్తారు. ఆయా కంపెనీలకు ఫెడరల్ గ్రాంట్లు, రుణాలు దక్కకుండా చేస్తారు. ఒకవేళ కాల్ సెంటర్లు విదేశాల్లో ఉంటే ఆ విషయాన్ని వినియోగదారులకు తెలియజేయాల్సి ఉంటుంది. అయితే వినియోగదారుడు కంపెనీ సేవను అమెరికాలో ఉంటున్న ఏజెంటుకు బదిలీ చేయాలని కోరితే సదరు సంస్థ తప్పకుండా చేయాల్సి ఉంటుంది. ఇది గతంలో ప్రవేశపెట్టిన బిల్లు వలె ఉందని సమాచారం. అమెరికన్ ఉద్యోగాలను సృష్టించడానికి, వాటిని పరిరక్షించుకోవడానికి కాంగ్రెస్ మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని గ్రీన్ తెలిపారు. ఇతర దేశాలకు తరలించే కంపెనీలకు రుణాలను మంజూరు చేయకూడదని అన్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.