Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

There won’t be any delay – Chandra Babu

By   /  June 11, 2016  /  Comments Off on There won’t be any delay – Chandra Babu

    Print       Email

Chandrababu1గ‌డువు పెంచే ప్ర‌స‌క్తే లేదు

 

InCorpTaxAct
Suvidha

 

 

“ప్ర‌తి ఒక్క‌రూ రాష్ట్ర ప‌రిస్థితులును అర్థం చేసుకోవాలి. చెప్పిన గ‌డువు లోపు అమ‌రావ‌తి అంద‌రూ త‌ర‌లిరావాల్సిందే. ముఖ్యంగా ఉద్యోగులు. పాల‌న‌కు కొన్నిఇబ్బందులు ఉన్నా స‌ర్దుకునిపోయి ప‌ని చేయాలి. అభివృద్ధికి పాటుప‌డాలి“ అని ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఉద్యోగుల‌తో స్ప‌ష్టం చేశారు. గ‌డువు పెంచాల‌ని కోరుతూ ఆయా విభాగాల‌ హెచ్‌వోడీలు ముఖ్య‌మంత్రిని క‌లిసి విన‌తిప‌త్రం చేసిన నేప‌థ్యంలో బాబు స్పందిస్తూ ఇప్ప‌టికే ప్ర‌భుత్వం ఏర్ప‌డి రెండేళ్లు అవుతోంద‌ని, ఇక గ‌డువు పెంచే ప్ర‌స‌క్తే లేద‌ని తేల్చి చెప్పారు. తరలింపు ప్రక్రియ వాయిదా వేసుకునే ఆలోచనతో ఉండొద్దని ము ఖ్యమంత్రి గట్టిగా చెప్పారు. రాష్ట్ర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పాలనకు సహకరించాలని.. అభివృద్ధికి అం దరి సహకారం ఎంతో అవసరమని వివరించారు. అనవ సర వివాదాలకు తావిచ్చే విధంగా వ్యవహరించొద్దన్నారు. అటువంటి వ్యవహారాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించే దిలేదని చంద్రబాబు హెచ్చరించారు.

ఉద్యోగులకు తగిన సౌకర్యాలు కల్పించేందుకు, సమస్యల పరిష్కారానికి సిద్ధంగా ఉన్నామని… తరలింపును అడ్డుకునే విధంగా ఎవరెవరినో కలిసి వివాదాలు సృష్టించేందుకు యత్నిస్తే మాత్రం కఠినంగా వ్యవహరిస్తామని బాబు స్ప‌ష్టం చేశారు. అంతేకాదు ఆలోచిస్తూ కూర్చుంటే ప‌నులు ఏ ప‌నులు కావ‌న్నారు. ఉద్యోగులుకు ఏవైనా ఇబ్బందులు ఉంటే అవ‌న్నీ ప‌రిష్క‌రించేందుకు ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌న్నారు. చిన్న చిన్న ఇబ్బందులు ఏవైనా ఉంటే ఒక‌రికొక‌రు స‌హ‌క‌రించుకుని ప‌ని చేయాల‌న్నారు. అవిలేవు.. ఇవి లేవ‌ని ఎవ‌రైనా అమ‌రావ‌తికి రాకుండా ఉండేదుకు సాకులు చెబితే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. అమ‌రావ‌తికి త‌ర‌లివ‌స్తున్న అధికారుల‌కు స‌క‌ల సౌక‌ర్యాలు క‌ల్పిస్తామ‌ని చంద్ర‌బాబు హామీ ఇచ్చారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →