ఇది ఆరంభమే అంటున్న వైయస్ జగన్
ఉధ్యమాన్నిఉధృతం చేస్తాం
దీక్ష భగ్నం చేసినంత మాత్రాన రైల్వే జోన్ ఉద్యమం ఆగదు
త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం
అధికారం చేతిలోఉంది కదా అని దీక్షను భగ్నం చేయవచ్చు కానీ.. రైల్వే జోన్ విషయమై చేసే ఉద్యమాన్ని ఆపలేరని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్‌రెడ్డి అధికార పార్టీని హెచ్చరించారు. ప్రత్యేక రైల్వేజోన్ కోసం విశాఖపట్నంలో ఐదు రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వైయస్ఆర్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ను పోలీసులు ఆస్పత్రికి దీక్షను భగ్నం చేశారు. ఈ నేపథ్యంలో వైయస్ జగన్ సోమవారం విశాఖ చేరుకుని అమర్నాథ్కు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింప చేశారు. ఈ సందర్భంగా వైయస్ జగన్ మాట్లాడుతూ విశాఖ రైల్వే జోన్ విషయం అధికార పార్టీ మద్దతు తెలపాల్సింది పోయి దీక్షను భగ్నం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. 6 దశాబ్దాల కలను 6 నెలల్లో పరిష్కరిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రభుత్వం రెండేళ్లు అవుతున్నా ఎందుకు పరిష్కరించలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని, ఇంటికో ఉద్యోగం కానీ..రైతులు, డ్వాక్రా సంఘాల రుణాల మాఫీ కానీ ఏదీ చేయలేదని విమర్శించారు. విభజన చట్టంలో పేర్కొన్న వాటిని ప్రత్యేక హోదా దగ్గరి నుంచి విశాఖకు రైల్వే జోన్ వరకు అన్నింటినీ సాధించడంలోటీడీపీ విఫలమైందని ఆరోపించారు. ఒకసారి రైల్వేజోన్ వస్తే 16 హెచ్ఓడీలు వస్తారని, వాళ్లందరూ కూడా ఇక్కడి నుంచే ఆపరేట్ చేస్తారని అప్పుడు ఉద్యోగావకాశాలు మెరుగవుతాయన్నారు. కేంద్రం ఏమీ ఇవ్వకపోయినా చంద్రబాబు నాయుడు అడిగేపరిస్థితిలో లేడని, గట్టిగా నిలదీసి అడిగితే.. ఓట్ల కోసం కోట్లు ఖర్చుపెట్టి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన విషయంపైనా, పక్క రాష్ట్రంలో ఆడియో వీడియో టేపులతో బయటపడ్డ విషయంపైన ఎక్కడ విచారణలు జరుగుతాయోనని భయపడి 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను పణంగా పెట్టాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు. రైల్వే జోన్ విషయంలో చేసే ఈ ఉద్యమాలు ఆరంభం మాత్రమే కానీ అంతకం కాదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.