Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Tholiprema telugu movie review

By   /  February 10, 2018  /  Comments Off on Tholiprema telugu movie review

    Print       Email

తొలిప్రేమ : రివ్యూ

 

InCorpTaxAct
Suvidha

 

 

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, రాశి ఖన్నా జంటగా వెంకీ అట్లూరి డైరక్షన్ లో వచ్చిన సినిమా తొలిప్రేమ. బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ టైటిల్ తో వచ్చిన వరుణ్ తేజ్ ఈ సినిమాతో ఎలా అలరించాడు అన్నది ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ :

ఆదిత్య (వరుణ్ తేజ్) మనసులో ఎలాంటి ఫీలింగ్ దాచుకోడు. స్ట్రైట్ ఫార్వడ్ గా ఉండే అతనికి ట్రైన్ జర్నీలో వర్ష (రాశి ఖన్నా) కబడుతుంది. ఆమెను చూసి ప్రేమలో పడిపోయిన ఆదిత్య ఆమెకు ప్రపోజ్ చేస్తాడు. ఇక ట్రైన్ దిగే టైంకు వర్ష ఆదిత్యాకు చెప్పాపెట్టకుండా వెళ్తుంది. ఆఫ్టర్ ఫ్యూ మంథ్స్ సేం కాలేజ్ లో ఆదిత్య వర్ష కలుస్తారు. అప్పుడు వారిద్దరు గొడవపడతారు. ఆ తర్వాత మళ్లీ 6 ఏళ్లకు లడన్ లో కలుస్తారు. ఇంతకీ ఆదిత్య, వర్షల ప్రేమ గెలిచిందా..? వారిద్దరు ఎందుకు విడిపోతారు..? ఆదిత్య, వర్షల లవ్ స్టోరీ ఎలా ముగిసింది అన్నది సినిమా కథ.

నటీనటుల ప్రతిభ :

ఫిదా సక్సెస్ తర్వాత వరుణ్ తేజ్ కెరియర్ లో కొత్త ఉత్సాహం తెచ్చుకున్నాడు వరుణ్ తేజ్. ఈ సినిమాలో తను నటనలో పరిణితి కబడుతుంది. ఇక రాశి ఖన్నా క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంది. లీడ్ పెయిర్ స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు ఆకర్షణ. ఇక ప్రియదర్శి సినిమాలో ఎక్కువ పాత్ర చేశాడు. హైపర్ ఆది కూడా అలరించాడు. మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించారు.

సాంకేతికవర్గం పనితీరు :

జార్జ్ సి విలియమ్స్ సినిమాటోగ్రఫీ సినిమాకు హైలెట్.. ఫారిన్ లొకేషన్స్ అంతా అందంగా చూపించారు. తమన్ మ్యూజిక్ పర్వాలేదు. ఎడిటింగ్ ఒకే. వెంకీ అట్లూరి కథ రొటీన్ గా అనిపించినా కథనం నీట్ గా ఫీల్ గుండ్ గా తీసుకెళ్లాడు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి.

విశ్లేషణ :

హీరోయిన్ చూసి హీరో ఫస్ట్ సైట్ కే పడిపోవడం.. ఆమె కూడా హీరోకి ఓకే చెప్పడం.. ఆ తర్వాత ఇద్దరు ప్రేమలో గొడపడటం విడిపోవడం.. కలవడం ఇలాంటి కథలు తెలుగులో చాలానే వచ్చాయి. అలాంటి కథే అయితే హీరో, హీరోయిన్ క్యారక్టరైజేషన్ మీద కాస్త ఎక్కువ దృష్టి పెట్టాడు డైరక్టర్ వెంకీ. ఇక సినిమాలో లవ్ అండ్ ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకున్నాయి.

ఫస్ట్ హాఫ్ అంతా యూత్ ఫుల్ గా సాగుతుంది. లీడ్ పెయిర్ లవ్ సీన్స్ బాగున్నాయి. ఇక సెకండ్ హాఫ్ కాస్త ఎమోషనల్ గా నడుస్తుంది. సినిమా ఎక్కడ బోర్ కొట్టించదు కాని సినిమాలో ఏం జరుగుతుందో ముందే ఊహించేదిగా ఉంటుంది. రొటీన్ కథ.. కథనం కాస్త రీఫ్రెషింగ్ గా అనిపిస్తుంది. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వరుణ్ తేజ్ తొలిప్రేమ యువతకు నచ్చేస్తుంది.

ప్లస్ పాయింట్స్ :

లీడ్ పెయిర్

మ్యూజిక్

సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్ :

రొటీన్ స్టోరీ

ల్యాగ్ అవడం

బాటం లైన్ :

మనసులను తాకే ‘తొలిప్రేమ’..!

రేటింగ్ : 3/5

 

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

NATA Atlanta Summber Camp & Art Exhibition a grand success – 400 plus new life members to NATA Family

Read More →