Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Tin Kave elected as a President of Myanmar

By   /  March 16, 2016  /  Comments Off on Tin Kave elected as a President of Myanmar

    Print       Email

tin kave elected as a president of myanmarమియాన్మార్ అధ్యక్షుడిగా తిన్ క్యావ్..

 

InCorpTaxAct
Suvidha

 

మియాన్మార్‌లో అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో తిన్ క్యావ్ ( 69 ) ఘన విజయం సాధించారు. మియాన్మార్ లో మొదటిసారిగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయి. తిన్ క్యావ్.. అంగ్ సాన్ సూచీకి అత్యంత సన్నిహితుడుగా రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అధ్యక్షురాలిగా పోటీ చేసేందుకు తనకు అర్హతలేకుండా మిలటరీ కుట్ర చేసిందని అంగ్ సాన్ సూచీ విమర్శించారు. అందువల్లే తనకు అత్యంత నమ్మకస్తుడు అయిన తివ్ ను బరిలో నిలిపారు. తన విజయం సూచీ విజయంగా తిన్ కూడా ప్రకటించారు.

‘ ఇది తన సోదరి సూచీ విజయమే.. థ్యాంక్యూ’ అంటూ ఆయన అన్నారు. అధ్యక్ష ఎన్నికలో మొత్తం 652 పోల్ అయ్యాయి. ఇందులో తిన్ క్వావ్ కు 360 ఓట్లు దక్కాయి. గత ఏడాది నవంబర్ లో సార్వత్రిక ఎన్నికలలో సూచీ(70) నేతృత్వంలోని ఎన్‌ఎల్‌డీకి ఉభయసభలలో భారీ మెజారిటీ సాధించింది. తిన్ క్యావ్‌ ఏప్రిల్‌ ఒకటిన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. తిన్ క్వావ్ కు భారత ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు.

తిన్ క్వావ్ కు మంచి విద్యాధికుడు. అలాగే ఆయనకు మంచి రచయిత, పొలిటీషియన్ గా పేరుంది. 1946 జూలై 20న కుంగ్యాన్‌గాన్‌లో జన్మించారు. రంగూన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో పట్టా తీసుకున్నారు. యూనివర్సిటీ ఆఫ్‌ లండన్‌లో కంప్యూటర్‌ సైన్స్‌లో ఉన్నత కోర్సులు కూడా చేశారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →