Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

TN Assembly Elections 2016: Jayalalithaa vs Karunanidhi, national parties to play second fiddle

By   /  March 5, 2016  /  Comments Off on TN Assembly Elections 2016: Jayalalithaa vs Karunanidhi, national parties to play second fiddle

    Print       Email

tamil-nadu-elections

తమిళనాట అధికార విపక్షాలు ఎత్తుకు పై ఎత్తులు..

InCorpTaxAct
Suvidha

తమిళనాడులో సాధారణ ఎన్నికలు జరిగిన ప్రతిసారీ అధికారం మారుతూ ఉంటుంది. తమిళులు ఓ సారి డీఎంకేకి అవకాశం ఇస్తే.. మరోసారి అన్నాడీఎంకేకి అవకాశం ఇస్తారు. అయితే ఈ సారి పరిస్థితులు కాస్త తారుమారు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రీసెంట్ గా దక్షిణాదిలో అతిపెద్ద ఎన్నికల యుద్ధానికి నగారా మోగింది. త్వరలో తమిళనాడులో కూడా ఎన్నికలు జరగనున్నాయి. దీంతో తమిళనాట రాజకీయాలు వేడెక్కాయి. అధికార విపక్షాలు ఎత్తుకు పైఎత్తులు వేసుకుంటున్నాయి.

తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఎన్నికల్లో 18 పార్టీలు తలపడుతున్నాయి. జయలలిత ఆధ్వర్యంలోని అన్నాడీఎంకే, కరుణానిధి నాయకత్వంలోని డీఎంకే, విజయకాంత్ డీఎండీకే బలంగా ఉన్నాయి. ఇక కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం వంటి జాతీయ పార్టీలతో పాటు జీకే మణి పీఎంకే, వైకో ఎండీఎంకే, శరత్‌ కుమార్ నేతృత్యంలోని ఎస్‌ఎంకే లాంటి పార్టీలు కూడా బరిలో నిలవనున్నాయి. అయితే ద్రవిడ పార్టీలు జాతీయ పార్టీల ప్రభావం లేకుండా చేశాయి. అక్కడి జనం జాతీయ పార్టీలను కాదని కేవలం ద్రవిడ పార్టీలకే పట్టం కడుతూంటారు. ఇలా అటు డీఎంకే గాని.. ఇటు గాని అధికారం చేపడుతూంటాయి.

ప్రస్తుతం జయలలిత ఆధ్వర్యంలోని అన్నాడీఎంకే అధికారంలో ఉంది. అయితే ఆమె అధికారంలో ఉండగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలుకు వెళ్ళాల్సి వచ్చింది. దీనికి తోడు ఆమెపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. విపక్షాలు జయలలిత నియంతృత్వ పోకడలు అనుసరిస్తున్నారని మండిపడ్డాయి. జయ జైలుకు వెళ్లడంతో ఆమె రాజకీయ జీవితం ముగిసిపోయిందని అందరూ భావించారు. అయితే కర్ణాటక హైకోర్టు తీర్పుతో జయలలితకు ఊరట లభించింది. తర్వాత జరిగిన బై ఎలక్షన్ లో విజయం సాధించి మళ్ళీ ముఖ్యమంత్రి పదవి చేపట్టారు.

ఇక అవినీతి ఆరోపణలు, జయ జైలు కెళ్ళడం, చెన్నై వరద చర్యల్లో విఫలం కావడం వంటి కారణాలతో ఈ సారి ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుందని డీఎంకే సహా పలు పార్టీల నేతలు భావించారట. అయితే వారు ఊహించిన స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకత లేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీనికి కారణం డీఎంకే ప్రభుత్వ వైఫల్యాలను పూర్తి స్థాయిలో అనుకూలంగా మలచుకోలేకపోయిందని భావిస్తున్నారు. దీనికి తోడు ఆ పార్టీని అంతర్గత కుమ్ములాటలు దిగజార్చాయని అంటున్నారు. మరోవైపు.. అమ్మ పథకాలు పేరుతో వరుసగా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన జయ.. ఈ సారి కూడా తమదే అధికారం అని లెక్కలేసుకుంటోందట. అంతేకాదు.. సుస్థిర అభివృద్ధి పేరుతో ఎన్నికలకు వెళ్ళాలని భావిస్తున్నారు. అయితే డీఎంకే కాంగ్రెస్‌తో పాటు మిగతా విపక్ష పార్టీలతో జట్టుకట్టి అత్యధిక స్థానాలను గెలుచుకోవాలని ప్రణాళికలు వేస్తోంది. మరి ద్రవిడ పార్టీలలో ఎవరి ఎత్తులు పారుతాయో తెలియాల్సి ఉంది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →