మామూలుగా తమిళనాడు కాంగ్రెస్ కమిటీ (టీఎన్‌సీసీ) గ్రూపు రాజకీయాలకు పెట్టింది పేరు. అక్కడ సీనియర్ నేతలైన చిదంబరం, తంగబాలు, ఈవీకేఎస్ ఇలంగోవన్, కుమరి అనంతన్, వసంత్ కుమార్ ఇలా ప్రతి ఒక్కరికి ఒక గ్రూపు ఉందని, వీళ్లంతా ‘ఎవరికి వారే యమునా తీరే’ అన్న చందంగా ఉంటారని పేరు. వీరిని ఏక తాటిపైకి తెచ్చేం దుకు కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలేవీ సఫలం కాలేదు. దీంతో తమిళనాడులో పార్టీని నిలబెట్టేందుకు ఖుష్భూను టీఎన్‌సీసీ చీఫ్‌ను చేయడంపై ఢిల్లీలో చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఖుష్బూను రాహుల్ గాంధీ పిలిపించుకుని మాట్లాడారని కొందరు చెబుతుండగా, అధికార ప్రతినిధిగా ఆమె అభి ప్రాయం తెలుసుకునేందుకు పార్టీ అధి ష్ఠానం ఆమెను పిలిపించిందని మరి కొంద రు పేర్కొంటున్నారు. రాహుల్, సోనియాతో భేటీ అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఏఐసీసీ చీఫ్ సోని యా గాంధీతో మర్యాదపూర్వకం గా భేటీ అయ్యా నని అన్నారు.
టీఎన్‌సీసీ అధ్యక్షు డిగా మళ్లీ ఈవీకేఎస్ ఇలంగోవన్నే నియమిం చాలని తాను చెప్పలేదని ఆమె స్పష్టం చేశారు. అధిష్ఠానానికి అన్నీ తెలుసని చెప్పిన ఆమె, తనకు టీఎన్‌సీసీ అధ్యక్షురాలి పదవి ఇస్తే మనసారా స్వీకరిస్తానని కూడా చెప్పారు. అయితే కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ గ్లామర్కంటే సినిమా గ్లామర్‌నే నమ్ముకున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా అలనాటి బాలీవుడ్ హీరో రాజ్ బబ్బర్ ను ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. మరికొద్ది నెలల్లో యూపీ స్టేట్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న వేళ.. రాజ్ బబ్బర్ ను యూపీ పార్టీ చీఫ్ గా ఎంపిక చేయటం కాస్తంత ఆస్తకికరంగా మారింది.
మరోవైపు తమిళనాడు కాంగ్రెస్ చీఫ్ ను మార్చాలన్న ఆలోచనలో ఉన్న కాంగ్రెస్.. ఈసారి ఆ అవకాశం నాటి హీరోయిన్ కుష్భూ చేతికి ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రికార్డు స్థాయిలో వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా జయలలిత బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఒక మహిళను పార్టీ అధ్యక్షురాలిగా నియమిస్తే ప్రయోజనం ఉంటుందన్న ఆలోచనతో పాటు.. కుష్బూ పట్టుదల మీద నమ్మకంతో ఆమెకు అవకాశం ఇచ్చే దిశగా పార్టీ అధినాయకత్వం ఆలోచిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఈ వాదనకు బలం చేకూరేలా ఆమెతో పార్టీ చీఫ్ సోనియాగాంధీ.. పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాందీ భేటీ అయిన సంగతి తెలిసిందే.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.