ఆధునిక చాణుక్యుడు పీవీ
పాములపర్తి వెంకట నరసింహారావు అంటే అందరికీ తెలియకపోవచ్చు. కానీ పీవీ అంటే గుర్తుపట్టని భారతీయుడు ఉండరంటే అతిశయోక్తి కాదు. సామాన్యుడిగా మొదలైన ఆయన ప్రస్థానం అంచెలంచెలుగా ఎదిగి దేశ ప్రధాని స్థానం వరకు చేరింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న దేశాన్ని గట్టించి దిశా.. దశా మార్చిన ఘనత ఆయనది. ఎన్నో సంస్కరణల పితామహుడిగా పేరు పొందిన మహనీయుడు పీవీ నరసింహారావు. నేడు ఆయన 99వ జయంతి ఈ సందర్భంగా పీవీపై ప్రత్యేక కథనం…
ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్జిల్లా లక్కంపల్లి గ్రామంలో జూన్ 28, 1921లో పీవీ నరసింహారావు జన్మించారు. తర్వాత కాలంలో హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నారు. కవిగా, రచయితగా, సాహితీ వేత్తగా, లాయర్‌గా ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలిగా పీవీ పేరు తెచ్చుకున్నారు. ఎవరికీ సాధ్యం కానీ 9 భారతీయ భాషలు, 8 విదేశీ భాషల్లో ప్రావీణ్యం ఉన్న ఒకే ఒక్కడుగా పీవీ చరిత్ర సృష్టించారు. హైదరాబాద్ సంస్థానంలో 1940లో నిజాం రాజుకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలోనూ పీవీ కీలక పాత్ర పోషించారు. 1948 నుంచి 1955 మధ్య కాలంలో పీవీ ఆయన బంధువుతో `కాకతీయ పత్రిక`ను నడిపారు. అలా ప్రారంభమైన ఆయన ప్రస్థానం రాజకీయాల్లోకి వచ్చి దేశ ప్రధానిగా భారతదేశానికి ఎన్నో సేవలు అందించారు. దేశంలో ఎటుచూసినా నిరాశ, నిస్పృహలు నిండిన తరుణంలో ఆయన చూపిన దార్శనికత ఇప్పటికీ ఫలాలు అందిస్తూనే ఉంది. సరళీకృత ఆర్థిక విధానాలతో దేశ దిశను, దశను మార్చి.. భారతీయ ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పేరొందిన పీవీ దేశానికి కొత్త పునరుజ్జీవానాన్ని అందించారు.అత్యంత కఠినమైనవిగా భావించిన ఆర్థిక, రాజకీయ సంస్కరణలకు పీవీ ఆద్యుడిగా నిలిచారు. మొట్టమొదటి తెలుగు ప్రధానిగా, ఆధునిక చాణుక్యుడిగా పీవీని నేటికీ దేశం కీర్తిస్తూనే ఉంది.
పీవీకి సాహిత్యం అంటే ఇష్టం…
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు సాహిత్యం అంటే ఇష్టం. అందుకే విశ్వనాథ సత్యనారాయణ రాసిన వేయిపడగలు పుస్తకాన్ని పీవీ సహస్రఫణ్ గా హిందీలోకి అనువదించారు. ఈ పుస్తకానికి వీపీకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. అంతేకాదు పీవీ రచించిన ఆత్మకథాత్మక నవల. తాను ముఖ్యమంత్రి పదవి అధిష్టించి.. దిగిపోయేంతవరకూ ఆయన జీవితఘట్టాలకు ఈ నవలలోని చిత్రణకు చాలా దగ్గర పోలిక వుంది. నవలలోని కథానాయకుడు ఆనంద్.. పీవీ నరసింహారావేనని విమర్శకులు భావించారు. ఇందులో జాతీయస్థాయి నాయకుల పాత్రలకు నిజమైన పేర్లు పెట్టి, రాష్ట్రనాయకుల పాత్రలకు మాత్రం పేర్లు మార్చారు. ఈ బృహన్నవల వివిధ భాషల్లోకి అనువాదమయింది. ఇలా పాములపర్తి వెంకట నరసింహారావు చివరి వరకు అన్నీ తెలిసిన సామాన్యుడిగానే ఉండిపోయారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.