Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Today, the black day of Democracy: Roja

By   /  March 18, 2016  /  Comments Off on Today, the black day of Democracy: Roja

    Print       Email

mla roja 1 ఇవాళ ప్రజాస్వాయ్యంలో బ్లాక్ డే: రోజా

 

InCorpTaxAct
Suvidha

 

ప్రజాస్వామ్యంలో ఈ రోజును తమ పార్టీ బ్లాక్ డేగా పరిగణిస్తోందని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. తనను అసెంబ్లీ లోపలికి రానివ్వకపోవడం చాలా దారుణమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు తమ ఎమ్మెల్యే విషయంలో ప్రభుత్వ తీరుకు నిరసనలు తెలిపారు. రాజ్ భవన్ కు చేరుకున్న వైసీపీ నేతలు గవర్నర్ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. తర్వాత రోజా మీడియాతో మాట్లాడారు.   కోర్టు ఆర్డర్, లేఖను గురువారం సాయంత్రం అసెంబ్లీ కార్యదర్శికి ఇచ్చామన్నారు. కానీ శుక్రవారం ఉదయం తనను లోనికి వెళ్లేందుకు అవకాశం ఇవ్వలేదని వాపోయారు. చీఫ్ మార్షల్ గణేష్ బాబు టీడీపీ కార్యకర్తలాగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. గతంలో సస్పెన్షన్ విషయంలో స్పీకర్ ఛాంబర్ కు వెళితే మార్షల్స్ అనుచితంగా ప్రవర్తించారని తెలిపారు. ఇవాళ కూడా తమను అడ్డగించారని అన్నారు. న్యాయవ్యవస్థ కన్నా స్పీకర్ పవర్ ఎక్కువ ఉందని భావిస్తే కోర్టులో కేసు వేసినప్పుడు లాయర్లను ఎందుకు పంపించి వాదనలు వినిపించారని ప్రశ్నించారు. మంత్రి రావెల కిశోర్ బాబు మంత్రివర్గంలో కూర్చొవడానికి అర్హుడా.. ? అంటూ ప్రశ్నించారు. ఎమ్మార్వోపై దాడి చేసిన చింతమనేని ప్రభాకర్ అసెంబ్లీలో కూర్చొన్నాడన్నారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలను రక్షించుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →