Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Tough time for film Industry

By   /  March 2, 2018  /  Comments Off on Tough time for film Industry

    Print       Email

సినిమాకు క‌ష్ట‌కాలం

InCorpTaxAct
Suvidha

 

 

 

 

* నేటి నుంచి సినిమా ప్ర‌ద‌ర్శ‌న‌లు బంద్‌

* డిజిట‌ల్ ప్రొవైడ‌ర్లు దిగొచ్చే వ‌ర‌కు ఆపేస్తాం

* నిర్మాత‌ల ఐకాస చైర్మ‌న్ సురేశ్‌బాబు

సమకాలీన సమాజంలో సినిమా ఒక అత్యంత ప్రాముఖ్యత గల అంశంగా అభివృద్ధి చెందింది. అలాంటి సినిమాకే నేడు క‌ష్ట‌కాలం వ‌చ్చింది.  డిజిటల్ ప్రొవైడర్స్‌తో తలెత్తిన సమస్యలను ప‌రిష్క‌రించాల‌ని డిమాండ్ చేస్తూ ఉభయ తెలుగు రాష్ర్టాలతోపాటు తమిళనాడు, కర్ణాటక, కేరళలో మార్చి 2 నుంచి సినిమా థియేటర్ల బంద్‌కు పిలుపు ఇచ్చినట్టు నిర్మాతల ఐకాస చైర్మన్ డి.సురేశ్‌బాబు తెలిపారు. ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ డిజిటల్ ప్రొవైడర్‌ల నుంచి ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి దక్షిణాదికి చెందిన ఐదురాష్ర్టాల నిర్మాతల మండలి సంయుక్తంగా జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసినట్టు తెలిపారు.  ఆంగ్ల చిత్రాలకు వర్చువల్ ప్రింట్ ఫీజు (వీపీఎఫ్) వసూలు చేయడం లేదని, తెలుగు చిత్రాలకు మాత్రం ఎక్కువ మొత్తంలో వసూలు చేస్తున్నార‌ని, పూర్తిగా తగ్గించాలని కోరుతున్నామ‌న్నారు.  ఈ విషయంలో వారు దిగొచ్చేవరకు థియేటర్ల బంద్ కొనసాగుతుంది  సురేశ్‌బాబు చెప్పారు.

ఇదిలా ఉంటే  బుక్ మై షో, ఈజీ మూవీస్, టికెట్ అడ్డా వంటి వెబ్ సైట్లు అడ్వాన్స్ బుకింగ్స్ ను నిలిపివేశాయి.  అయితే వీపీఎఫ్ (వర్చువల్ ప్రింట్ ఫీజ్)ను తగ్గించాలని నిర్మాతలు డిమాండ్ చేస్తుండగా.. క్యూబ్, యూఎఫ్ఓ వంటి డిజిటల్ సేవా సంస్థలు దిగిరాకపోవడంతో సినిమాలనే నిలిపివేయాలన్న సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ప్ర‌జ‌లు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Prayer to protect from Corona Virus

Read More →